KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} కి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా రైడర్స్ {కేకేఆర్} కి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు ఉమ్రాన్ మాలిక్. దీంతో అతనికి రీప్లేస్మెంట్ గా 27 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ చేతన్ సకారియాను ఎంపిక చేసుకుంది కేకేఆర్ మేనేజ్మెంట్.
Also Read: Akmal brothers: పాక్ మాజీ క్రికెటర్ల ఇంట్లో దొంగలు పడ్డారు..!
కాగా ఉమ్రాన్ మాలిక్ ని కేకేఆర్ 2025 మెగా వేలంలో 75 లక్షలకు దక్కించుకుంది. కానీ అతడు కేకేఆర్ తరపున ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వైదొలిగాడు. మెరుపు లాంటి బంతులతో ఐపిఎల్ లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్.. ఆ తరువాత అద్భుతంగా మారి అదృశ్యమయ్యాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఐపీఎల్ 2021 నుండి 24 వరకు ఆడిన ఉమ్రాన్.. ప్రతి మ్యాచ్ లోను ఫాస్టెస్ట్ బౌలర్ అవార్డును దక్కించుకొని క్రీడాభిమానులను ఆకట్టుకున్నాడు.
2021లో హైదరాబాద్ జట్టు తరఫున అరంగేట్రం చేసి.. గత సీజన్ వరకు అదే జట్టుకు ఆడాడు. మూడు సీజన్లలో ఎస్ఆర్హెచ్ తరపున 26 మ్యాచ్ లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనల కారణంగా టీమ్ ఇండియాలో సైతం చోటు దక్కించుకున్నాడు. భారత్ తరపున 10 వన్డేలు, 8 టీ-20 లు ఆడి 24 వికెట్లు తీశాడు. అయితే మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభం కాబోతుండడం, మొదటి మ్యాచ్ లోనే కేకేఆర్ ఆడనుండగా ఆ జట్టుకు షాక్ తగిలింది.
గాయం కారణంగా ఉమ్రాన్ మాలిక్ టోర్నీ నుండి తప్పుకోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక అతడి స్థానంలో కేకేఆర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు సకారియా. ఇతడు గుజరాత్ లో పుట్టి దేశవాళీ క్రికెట్ లో సౌరాష్ట్రకు ఆడుతూ గత సీజన్ లో కేకేఆర్ తో పాటే ఉన్నాడు. కానీ అతడికి గత సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అరంగేట్రం చేసి.. 2022 – 23 సంవత్సరాల లో రాజస్థాన్ రాయల్స్ కి ఆడాడు.
Also Read: Jasprit Bumrah: షూలు కొనడానికి డబ్బులు.. బుమ్రా కష్టాలు అన్ని ఇన్ని కాదు ?
సకారియా తన ఐపిఎల్ కెరీర్ లో 19 మ్యాచులు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ఇక 2021లో టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేసి.. ఒక వన్డే, రెండు టీ20 లు ఆడాడు. ఇక ప్రస్తుతం కలకత్తా నైట్ రైడర్స్ జట్టు సకారియాని 75 లక్షల బేస్ ధరకు దక్కించుకుంది. మరోవైపు ఈ సీజన్ లో కేకేఆర్ జట్టుకు కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అలాగే వెంకటేష్ అయ్యర్ ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు.