BigTV English

Indian Railway New Super App: ఐఆర్‌సీటీసీ.. సూపర్ యాప్ కు మధ్య తేడా ఇదే, టికెట్ బుకింగ్ తోపాటు మరెన్నో!

Indian Railway New Super App: ఐఆర్‌సీటీసీ.. సూపర్ యాప్ కు మధ్య తేడా ఇదే, టికెట్ బుకింగ్ తోపాటు మరెన్నో!

Indian Railways: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సంస్థ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో సరికొత్త యాప్ ను విడుదల చేబోతున్నది. ఇప్పటి వరకు రకరకాల యాప్స్ ద్వారా రైల్వే సేవలు అందుతుండగా, ఇకపై అన్ని సేవలు ఒకే గొడుగు కిందికి రాబోతున్నాయి. ఇందుకోసం భారతీయ రైల్వే సంస్థ సూపర్ యాప్ ను అందుబాటులోకి తేబోతున్నది. ఫ్లాట్ ఫారమ్ టికెట్ కొనుగోలు మొదలుకొని రియల్ టైమ్ ట్రైన్ స్టేటస్ వరకు ఇందులోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైల్వే ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది.


IRCTC సూపర్ యాప్ ప్రత్యేకతలు   

⦿ ఈజీగా టికెట్ బుకింగ్: ఈ యాప్ ఫ్లాట్ ఫారమ్ టికెట్ మొదలుకొని ఎక్స్‌ ప్రెస్, సూపర్‌ ఫాస్ట్, దురంతో సహా అన్ని రకాల రైళ్లకు సంబంధించిన టికెట్లను ఈజీగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ఇంటర్‌ ఫేస్ గతంతో పోల్చితే మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.


⦿ PNR స్టేటస్ ట్రాకింగ్: ఈ యాప్ ద్వారా PNR స్టేటస్‌ ను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు, రైలుకు సంబంధించిన రియల్ టైమ్ ట్రాకింగ్ కు అనుమతిస్తుంది. రైళ్ల ఆలస్యం, క్యాన్సిల్, రైలు షెడ్యూళ్లలో మార్పులు సహా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

⦿ ఫుడ్ ఆర్డర్: రైలు ప్రయాణీకులు ఇకపై నేరుగా ఈ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. పలు ఫుడ్ సర్వీస్ యాప్ సహకారంతో వినియోగదారులు వారికి నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన స్టేషన్ లో ఫుడ్ డెలివరీ తీసుకోవడంతో పాటు నచ్చిన పద్దతుల ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.

⦿ టూరిజం సర్వీసులు: ఈ సూపర్ యాప్ ద్వారా టిక్కెట్ బుకింగ్స్ తో పాటు సమగ్రమైన ప్రయాణ, పర్యాటక సేవలను అందిస్తుంది. వినియోగదారులు హోటళ్లు, హాలీ డే ప్యాకేజీలు, IRCTC టూర్ ప్యాకేజీలను కూడా బుక్ చేసుకోవచ్చు. మొత్తం టూర్ ప్లాన్ ను ఈ యాప్ మరింత సులభతరం చేస్తుంది.

⦿ సురక్షితమై, వేగవంతమైన చెల్లింపులు: ఈ యాప్ ద్వారా సులభంగా, వేగంగా, సేఫ్ గా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. వాలెట్ ఆధారిత చెల్లింపులు, UPI చెల్లింపులు కూడా చేసుకోవచ్చు.

⦿ రియల్-టైమ్ అప్‌డేట్లు, నోటిఫికేషన్లు: ఈ యాప్ రైలు షెడ్యూల్‌, సీట్ల లభ్యత, ఇతర ప్రయాణ సంబంధిత అప్‌డేట్లకు సంబంధించి వినియోగదారులకు రియల్ టైమ్ నోటిఫికేషన్లు పంపుతుంది. ఈ ఫీచర్ ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు తాజా వివరాలను అందిస్తుంది.

పాత IRCTC యాప్ ఎలా ఉండేదంటే?

⦿ ఇక ప్రస్తుతం ఉన్న IRCTC యాప్ పరిమిత సర్వీసులను అందించేది.  ప్రయాణీకులు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, PNR స్టేటస్ చెకింగ్ కోసం మాత్రమే ఈ యాప్ ఉపయోగపడేది.

⦿ పలు రకాల రైల్వే సేవల కోసం పలు రకాల యాప్స్ ఉపయోగించాల్సి ఉండేది.

IRCTC VS. కొత్త సూపర్ యాప్

⦿ పాత వెర్షన్ యాప్‌ తో పోల్చితే IRCTC సూపర్ యాప్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నది.

⦿ IRCTC యాప్  టికెటింగ్‌ పై ఎక్కువ ఫోకస్ పెట్టేది. కొత్త యాప్ ఈ పరిధిని విస్తృతం చేసింది.

⦿ సూపర్ యాప్ టిక్కెట్ బుకింగ్‌ తో పాటు, టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకోవడానికి, ట్రైన్ కరెంట్ స్టేటస్ తెలుసుకునేందుకు, ఫుడ్ ఆర్డర్ కోసం ఆల్ ఇన్ సొల్యూషన్ గా మారుతుంది.

⦿ ఫాస్ట్ చెల్లింపులతో పాటు మెరుగైన ట్రాకింగ్ సిస్టమ్‌ తో సహా సూపర్ యాప్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది.

రైల్వే ప్రయాణీకులకు కలిగే లాభాలు

⦿ ఈజీ సర్వీసులు: ఒకే యాప్ ద్వారా అన్ని రైల్వే సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది.

⦿ టైమ్ సేవ్: ఈజీగా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు సేఫ్ గా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. టైమ్ గణనీయంగా సేవ్ చేసుకోవచ్చు.

⦿ మెరుగైన భద్రత: ఇంటిగ్రేటెడ్ పేమెంట్ మెథడ్స్, మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లతో, ప్రయాణీకులు తమ డేటా, డబ్బును సేఫ్ గా ఉంచుకోవచ్చు.

Read Also: వెయిటింగ్ లిస్టు టికెట్ల కన్ఫర్మేషన్ వెనుక ఇంత కథ ఉందా? అసలు విషయం చెప్పిన రైల్వే సంస్థ!

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×