Indian Railways: సాధారణంగా రైల్వే ప్రయాణీకులు ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటారు. కొంత మందికి టికెట్లు కన్ఫార్మ్ అయితే, మరికొంత మందికి వెయిటింగ్ లిస్టులో ఉంటాయి. వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి టికెట్లు, కన్ఫర్మ్ అవుతాయా? లేదా? అనేది కచ్చితంగా చెప్పలేరు. అత్యవసర ప్రయాణం ఉన్న వాళ్లు తమకు టికెట్లు ఓకే అవుతాయో? లేదో? అని టెన్షన్ పడుతుంటారు. ఎన్ని వెయిటింగ్ లిస్టు టికెట్లు కన్ఫర్మ్ అవుతాయో ఊహించడం కష్టం. అసలు వెయిటింగ్ లిస్టు టికెట్లను ఎలా కన్ఫర్మ్ అవుతాయో? అందుకు ఉపయోగించే ఫార్ములా ఏంటో తాజాగా రైల్వే సంస్థ వెల్లడించింది.
రెండు రకాలుగా టికెట్ల కన్ఫార్మేషన్
వాస్తవానికి సాధారణ సమయాలతో పోల్చితే పండగల వేళ రైలు టికెట్లకు బాగా డిమాండ్ ఉంటుంది. కొన్నిసార్లు వెయిటింగ్ లిస్టు టికెట్ల సంఖ్య ఏకంగా 500 వరకు ఉంటుంది. ఇలాంటి సమయాల్లో కన్ఫర్మేషన్ ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు రెండు విధాలుగా నిర్ధారించబడ్డాయి. ఒకటి సాధారణంగా కన్ఫర్మ్ టికెట్లు ఉన్నవాళ్లు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా, వారి స్థానంలో మరికొంత మందికి కన్ఫర్మ్ అవుతుంది. మరొకటి రైల్వే సంస్థకు చెందిన అత్యవసర కోటా ద్వారా వెయిటింగ్ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి.
వెయిటింగ్ లిస్టు టికెట్ల కన్ఫార్మేషన్ ఎలా ఉంటుంది?
రిజర్వేషన్లు చేసిన తర్వాత సగటున 21% మంది ప్రయాణీకులు రకరకాల కారణాలతో తమ రైలు టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటారు. సో, వెయిటింగ్ లిస్ట్ టికెట్లలో సాధారణంగా 21 శాతం టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, 72 సీట్లతో స్లీపర్ కోచ్ లో, సుమారు 14 సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అటు టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులలో సుమారు 4 నుంచి 5 శాతం మంది ప్రయాణించరు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 25 శాతం వరకు వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి. అంటే, స్లీపర్ కోచ్ లో 18 సీట్ల వరకు కన్ఫర్మ్ అవుతాయి.
ప్రతి రైలుకు మొత్తం ఎన్ని వెయిటింగ్ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి?
సాధారణంగా ఒక రైలులో 10 స్లీపర్ కోచ్‌లు ఉంటే.. ఒక్కొదాంటో 18 సీట్లు అందుబాటులోకి వస్తాయి. అంటే, రైలు అంతటా 180 వెయిటింగ్ లిస్ట్ సీట్లను కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే ఫార్ములా థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్ లకు వర్తిస్తుంది.
Read Also: ఇదెక్కడి రైలు రా మామా, ఏపీ నుంచి యూపీకి వెళ్లేందుకు మూడేళ్లు పట్టిందా?
ఎమర్జెన్సీ కోటాలో మరికొన్ని టికెట్ల కన్ఫర్మ్
ఇక రైల్వేశాఖకు సంబంధించిన అత్యవసర కోటాలో 10% సీట్లను కలిగి ఉంటుంది. ఈ సీట్లను రైల్వే సంస్థ తమకు ఇష్టానుసారం కేటాయించే అవకాశం ఉంటుంది. కొంత మంది అనారోగ్యంతో బాధపడేవారికి, లేదంటే.. అత్యవసరమైన ప్రయాణీకులకు కేటాయించే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఈ రిజర్వు చేసిన సీట్లలో 5 శాతమే ఉపయోగించినట్లయితే, మిగిలిన 5 శాతం వెయిటింగ్ లిస్టులో ఉన్న ఇతర ప్రయాణీకులకు కేటాయించే అవకాశం ఉంటుంది.
Read Also: బుల్లెట్ ట్రైన్ TO వందేభారత్ స్లీపర్ రైలు, భారతీయ రైల్వేలో కీలక ముందుడుగు!