Teenmar Mallanna – Pushpa 2: సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ట్రీట్మెంట్ గురించి వైద్యుల్ని అడిగితే ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని తనతో చెప్పినట్లు మల్లన్న తెలిపారు. శ్రీ తేజ్ ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్న మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు.
పుష్ప – 2 సినిమా రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెల్సిందే. హీరో అల్లు అర్జున్ వచ్చిన సంధర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందన్న ఆరోపణలను అల్లు అర్జున్ ఎదుర్కొంటున్నారు. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ తో పాటు, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఒక్కరాత్రి జైలు జీవితాన్ని గడిపి, న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావడంతో టాలీవుడ్ ప్రముఖులు, నటులు పరామర్శల దారి పట్టారు. ఈ తరుణంలో శ్రీ తేజ్ ఆరోగ్య స్థితి అందరినీ కలవరపెడుతోంది. ఇప్పటికే రేవతి మృతి చెందిన నేపథ్యంలో, శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. తాజాగా ఎమ్మేల్సీ తీన్మార్ మల్లన్న వైద్యశాలకు వెళ్లి శ్రీ తేజ్ హెల్త్ కండిషన్ తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
మల్లన్న మాట్లాడుతూ.. అబ్బాయి కండిషన్ క్రిటికల్ గానే ఉందని, కాన్షియస్ లో లేనట్లు వైద్యులు తెలిపారన్నారు. శ్రీ తేజ్ ఆరోగ్య స్థితి గురించి వైద్యుల్ని అడిగితే ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని అంటున్నట్లు మల్లన్న తెలిపారు. అందరూ అల్లు అర్జున్ ను కలుస్తున్నారు గాని, అసలు కలవాల్సింది గాయపడిన శ్రీ తేజనన్న విషయాన్ని టాలీవుడ్ గమనించాలన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించారని ప్రచారం చేస్తున్నారని, ఇందులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
Also Read: Sandhya Theater : ‘పుష్ప2’ ఎఫెక్ట్.. సంధ్యా థియేటర్ లైసెన్స్ రద్దు?
ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు సినిమా రంగం వారు బంద్ పెట్టాలని, మండలిలో ఈ విషయంపై మాట్లాడుతానన్నారు మల్లన్న. అందుకే శ్రీతేజ్ కుటుంబ సభ్యులు కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నట్లు తెలిపారు. పుష్ప 2కు భారీ కలెక్షన్లు వచ్చాయని విన్నట్లు కూడా మల్లన్న తెలిపారు. అందులో 10% అయినా శ్రీ తేజ్ కుటుంబానికి ఇవ్వాలని, ఇకమీదట బెనిఫిట్ షో విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు.