Indian Railways: మద్యం మత్తులో కొంత మందికి ఏం చేస్తున్నారో అర్థం కాదు. తాగుబోతుల వీరంగాలు, వికృత చేష్టలు తరచుగా చూస్తూనే ఉంటాం. మద్యం షాపుల దగ్గర బగ్గ తాగి వాళ్లు వేసే యోగాసనాలు చూస్తుంటే.. ఒళ్లు కంపరం ఎక్కుతుంది. రోడ్డు మీద వేసే చిల్లర వేశాలు చూస్తుంటే నాలుగు పీలకాలి అనిపిస్తుంది. ఇవన్నీ బయట జరుగుతాయి కాబట్టి నో ప్రాబ్లం. కానీ, తాజాగా రైళ్లో ఓ తాగుబోతు చేసిన పని చూస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..
అందరూ చూస్తుండగానే మూత్రం పోసిన ప్రయాణీకుడు
రీసెంట్ గా గౌహతి- బెంగళూరు ఎక్స్ ప్రెస్ లో ఓ ప్రయాణీకుడు కన్నూమిన్నూ ఎరగకుండా మద్యం తాగాడు. ప్రయాణ సమయంలో టాయిలెట్ కు వెళ్లాలి అనుకున్నాడు. లేచి నాలుగు అడుగులు ముందుకు వేశాడు. బాగా తాగి ఉండటంతో వాష్ రూమ్ ఎక్కడ ఉందో అర్థం కాలేదు. ఇంకేముంది.. అందరూ చూస్తుండగానే మూత్రం పోశాడు. ఎదురుగా మహిళలు ఉన్నారనే ఇంగితం లేకుండా పని కానిచ్చేశాడు. ఈ తతంగాన్ని అంతా ఓ ప్రయాణీకుడు వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన వైజాగ్- పెరంబూరు మధ్యలో జరిగినట్లు తెలుస్తోంది.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
ఈ వీడియో khagariajn అనే ఇన్ స్టా అకౌంట్ ద్వారా షేర్ అయ్యింది. లక్షలాది మంది నెటిజన్లు ఈ వీడియోను చూశారు. సదరు ప్రయాణీకుడు చేసిన పనికి ముక్కన వేలేసుకుంటున్నారు. వెంటనే అతడిపై కేసు నమోదు చేయడంతో పాటు శాశ్వతంగా రైలు ఎక్కకుండా నిషేధించాలని కోరుతున్నారు. వెంటనే అతడిపై రైల్వే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తాగుబోతు వెధవను కదులుతున్న రైల్లో నుంచి బయటకు తోసేస్తే పీడా విరగడ అవుతుందని మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజం అయితే, ఇప్పటి వరకు అతడు అరెస్ట్ అయి ఉండాలి అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. అయితే, సదరు ప్యాసింజర్ కు సంబంధించిన వివరాలు, రైల్వే అధికారులు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
Read Also: ఎయిర్ పోర్ట్ తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్, లోపలికి వెళ్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
గతంలో మహిళ ముఖంపై మూత్రం పోసిన టీటీఈ
గత కొంతకాలం క్రితం టీటీఈ ఏకంగా మహిళ ముఖం మీద మూత్రవిసర్జన చేయడం సంచలనం కలిగించింది. అమృత్ సర్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి అమృత్ సర్ నుంచి కోల్ కతా కు అకల్ తఖ్త్ ఎక్స్ ప్రెస్లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి దాటిన తరువాత మద్యం మత్తులో మున్నా కుమార్ అనే టీటీఈ బెర్త్ పై నిద్రపోతున్న సదరు వ్యక్తి భార్య ముఖం మీద పాస్ పోశాడు. ఆమె అరవడంతో అందరూ నిద్ర లేచారు. మద్యం మత్తులో ఉన్న టీటీఈని చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది.
Read Also: మరో 6 నెలల పాటు ఆ స్టాప్ ల కొనసాగింపు.. ఇక నచ్చిన చోట దిగండి!