BigTV English

Nithin: దొంగ అవుతానంటున్న నితిన్.. ఇదెక్కడి ఆలోచన మావా..?

Nithin: దొంగ అవుతానంటున్న నితిన్.. ఇదెక్కడి ఆలోచన మావా..?

Nithin: యంగ్ హీరో నితిన్ (Nithin) ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆయన నటించిన చిత్రం రాబిన్ హుడ్ (Robinhood). త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్లో వేగంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే దొంగ అవుతాను అంటూ చేసిన కామెంట్లకు అటు నెటిజన్స్ మాత్రమే కాదు ఇటు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . ముఖ్యంగా కొంతమంది నెటిజన్స్ అయితే నితిన్ కి పిచ్చిగాని పట్టలేదు కదా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.


ప్రమోషన్స్ లో వేగంగా పాల్గొంటున్న నితిన్..

వెంకీ కుడుముల (Venky kudumula) దర్శకత్వంలో నితిన్ హీరోగా, శ్రీ లీల (Sreeleela) హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం రాబిన్ హుడ్. ఈ మూవీ తో ఎలాగైనా హిట్టు కొట్టాలని నితిన్ చాలా పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్లను కూడా కాస్త డిఫరెంట్ గా చేస్తూ ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.అందులో భాగంగానే తాజాగా జరిగిన ఒక ఈవెంట్ లో నితిన్ ను యాంకర్ కొన్ని ప్రశ్నలు వేయగా.. అందులో నుంచి ఊహించని సమాధానం తెలిపారు నితిన్. ఇకపోతే టాలీవుడ్ హీరోల ఫోటోలు చూపిస్తూ వీరి నుంచి మీరు ఏం దొంగిలించాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నించగా.. నితిన్.. ఒక్కొక్క హీరో ఫోటో చూపించిన ప్రతిసారి ఒక్కో కామెంట్ చేశారు.


ఆ హీరోల నుంచి వాటిని దొంగిలిస్తానంటున్న నితిన్.

ఇకపోతే తనలో లేని క్వాలిటీని ఆ హీరో నుంచి దొంగిలిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక అలా వరుసగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నుంచి రౌడీ క్యారెక్టర్, ప్రభాస్(Prabhas ) నుంచి వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి అన్నీ దొంగిలిస్తానని చెప్పిన నితిన్.. అల్లు అర్జున్ (Allu Arjun) నుంచి డాన్స్, మహేష్ బాబు (Maheshbabu) నుంచి అందం కూడా దొంగలిస్తానని చెప్పుకొచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) నుంచి డైలాగ్ డెలివరీ, నాని(Nani ) నుంచి ఈగ మూవీ దొంగిలించాలని ఉంది అంటూ కూడా నితిన్ చెప్పుకొచ్చారు. ఇక శ్రీ లీలా కూడా కాజల్ (Kajal) నుంచి కళ్ళు, అనుష్క(Anushka) నుంచి హైట్ తీసుకోవాలని ఉందంటూ సరదాగా సమాధానం తెలిపింది. ఇక మొత్తానికి అయితే ఈ ప్రమోషన్స్ కాస్త ప్రేక్షకులకు మంచి వినోదాన్నే కాదు అటు సినిమాపై బజ్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఇక శ్రీ లీల విషయానికి వస్తే.. ఈమె కూడా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది అని చెప్పాలి. గత కొన్ని రోజులుగా సినిమాలలో నటిస్తోంది. కానీ సరైన సక్సెస్ లభించలేదు. ఇక పుష్ప 2 సినిమాలో ఏకంగా స్పెషల్ సాంగ్ చేసింది.ఆ పాటతో కాస్త గుర్తింపు వచ్చింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ అయితే లభించలేదు అని చెప్పాలి. ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమాపై తన ఆశలన్నీ పెట్టుకుంది. మరి ఏ మేరకు ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా కలిసి వస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×