Khel Ratna Award: భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం జనవరి 2వ తేదీ గురువారం మధ్యాహ్నం ప్రకటించింది. ఈ మేరకు 2024 సంవత్సరానికి గాను నలుగురు క్రీడాకారులకు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. ఈ అత్యున్నత అవార్డులను జనవరి 17వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ నలుగురు క్రీడాకారులకు ప్రధానం చేయనున్నారు.
Also Read: Clarke on Virat Kohli: టీమిండియాలో కల్లోలం.. కోహ్లీకి మళ్లీ కెప్టెన్సీ ?
ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అతి చిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన గుకేశ్ దొమ్మరాజుకు ఖేల్ రత్న అవార్డు వరించింది. అలాగే ఒలంపిక్ లో పథకం సాధించిన మనూ భాకర్ కి ఖేల్ రత్న అవార్డు వరించింది. ప్యారిస్ ఒలంపిక్స్ లో రెండు పథకాలను సాధించింది మనూ భాకర్.
పారా ఒలంపిక్స్ లో పథకం సాధించిన ప్రవీణ్ కి కూడా ఖేల్ రత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్ కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నలుగురు భారత అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
17 మంది పారా అథ్లెట్లు సహా 32 మందికి అర్జున అవార్డులు, ఐదుగురికి ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. ఈ ఏడాది అర్జున అవార్డులు కూడా ప్రకటించింది కేంద్రం. 32 మందిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ పారా అథ్లెట్ దీప్రీ జీవంజి కూడా అర్జున అవార్డుకు ఎంపికైంది. మొదట ఖేల్ రత్న నామినేషన్లలో మనూ బాకర్ పేరు లేకపోవడంతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే.
Also Read: Shubman Gill: రూ.450 కోట్ల స్కాం.. గిల్ తో పాటు మరో నలుగురికి CID నోటీసులు !
గతేడాది డిసెంబర్ 12న గుకేశ్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. సింగపూర్ వేదికగా జరిగిన {Khel Ratna Award} ప్రపంచ ఛాంపియన్షిప్ లో చైనాకు చెందిన డింగ్ లిరెన్ ని ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు. ఇక హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో భారత జట్టు ఒలింపిక్స్ లో వరుసగా రెండవసారి కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. ప్రవీణ్ కుమార్ హై జంప్ టి-64 ఈవెంట్ లో దేశానికి బంగారు పతకాన్ని అందించాడు. షూటర్ మనూ బాకర్ పారిస్ ఒలంపిక్స్ లో రెండు పథకాలు సాధించింది. ఈ నలుగురికి అత్యున్నత క్రీడా పురస్కారం అయిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఖేల్రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం
షూటర్ మను భాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారాఅథ్లెటిక్స్ ప్రవీణ్ కుమార్లకు ఖేల్రత్న అవార్డులు ప్రకటన
జనవరి 17వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం pic.twitter.com/9cqJA4aWJr
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2025