Vijayawada Girl Kidnap: గుంటూరులో 12 ఏళ్ల బాలిక కిడ్నాప్ సోమవారం కలకలం రేపింది. కిడ్నాపర్లు బాలికకు చెప్పిన కట్టుకథ, గుంటూరు నుంచి విజయవాడ వరకు తరలించిన విధానం.. అక్కడ కిడ్నాపర్ల నుంచి బాలిక తప్పించుకున్న తీరు.. ఇలా అంతా సినిమాను తలపించింది. చివరికి బాలిక క్షేమంగా తన ఇంటికి చేరుకుంది.
గుంటూరులోని వెంగళరావు నగర్‌లో 12 ఏళ్ల బాలికను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఉదయం 11 ఇంట్లో ఆ అమ్మాయి మాత్రమే ఉంది. ఆ సమయంలో కారులో వచ్చిన దుండగులు.. బాలిక తల్లికి యాక్సిడెంట్ జరిగిందని.. గాయాలతో కొట్టుమిట్టాడుతుందని.. వెంటనే తనను చూడాలనుకుంటుందని ఆమెకు చెప్పారు. దుండగుల మాటలు నమ్మిన చిన్నారి వారితో వెళ్లింది. కారులో ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లారు.
అక్కడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గరకు వెళ్లేసరికి బాలికకు మెలుకువ వచ్చింది. దుండగులు భోజనం చేసి వస్తామని చెప్పి దుండగులు బస్టాండ్ లోపలకి వెళ్లారు. ఇదంతా ఏదో తేడాగా బాలికకు అనుమానం వచ్చింది. కిడ్నాపర్లు కారు డోర్ కూడా సరిగా వేయకపోవడంతో బాధితురాలు కారు దిగి బస్ స్టాండ్‌లోకి వెళ్లి ఆర్టీసీ అధికారులకు చెప్పింది.
Also Read: అద్దెకు బ్యాంక్ అకౌంట్.. డబ్బే డబ్బు.. ఆశ పడితే ఇక అంతే!
అధికారులు విషయం తెలుసుకొని బాలిక పేరెంట్స్‌కు కాల్ చేశారు. తనకు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని చిన్నారి తల్లి చెప్పింది. అటు.. కారులో బాలిక లేకపోవడం కిడ్నాపర్లు అక్కడి నుంచి పరార్ అయ్యారు. దీంతో ఆర్టీసీ అధికారులు పోలీసులకు విషయం చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి పేరెంట్స్ దగ్గరకు క్షేమంగా చేరుకుంది.