Indian Railways: భారతీయ రైల్వే ద్వారా నిత్యం కోట్లాది మంది ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకరంగా రైల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకే, ఎక్కువ మంది ట్రైన జర్నీ చేసేందుకు ఇష్టపడుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రయాణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ టికెట్లు కన్ఫర్మ్ కావడం కష్టం అవుతుంది. ఒక్కోసారి అత్యవసర పరిస్థితులో వెంటనే వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో టికెట్ బుక్ చేసుకున్నా కన్ఫర్మ్ కావడం అంత ఈజీ కాదు. కానీ, ఓ స్పెషల్ కోటా ద్వారా ప్రయత్నిస్తే కచ్చితంగా కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది.
ఇండియన్ రైల్వే స్పెషల్ కోటా
రైల్వే టికెట్లు అనేవి పలు కోటాల ద్వారా పొందే అవకాశం ఉంటుంది. వెయిటింగ్ లిస్టులోని టికెట్లను కూడా ఈ కోటా ద్వారా కన్ఫర్మ్ చేయించుకునే అవకాశం ఉంటుంది. HO(హై అఫీషియల్) అని రైల్వేకు సంబంధించి స్పెషల్ కోటా ఉంటుంది. ఈ కోటా కింద బ్యూరోకార్ట్స్, వీఐపీలు, రైల్వే అధికారులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే, సాధారణ ప్రయాణీకులు కూడా ఈ కోటాను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ కోటా కింద కన్ఫర్మ్ టికెట్ పొందచ్చు. వాస్తవానికి HO కోటా కింద చాలా తక్కువ సీట్లు అందుబాటులో ఉంటాయి. టిక్కెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఈ కోటాను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. సాధారణ కోటా కింద రిజర్వేషన్ చేసినప్పటికీ వెయిటింగ్ లిస్ట్‌లోని టిక్కెట్లు HO కోటా కింద కన్ఫర్మ్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ కోటా కింద తక్కువ సంఖ్యలో సీట్లు ఉన్న నేపథ్యంలో.. ఎవరైనా దరఖాస్తు చేయగానే వెంటనే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది.
సాధారణ ప్రయాణీకులు ఎలా ఉపయోగించుకోవచ్చు?
HO కోటా అనేది నిర్దిష్ట వ్యక్తుల కోసం ఉద్దేశించబడినప్పటికీ, సాధారణ ప్రయాణీకులు కూడా ఈ కోటా కింద టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ కోటా కింద టికెట్లు పొందాలనుకునే వారు తమ ప్రయాణానికి సంబంధించి అత్యవసర పరిస్థితిని రైల్వే అధికారులకు అర్థం అయ్యేలా చెప్పాలి. ఒకవేళ వాళ్లు కన్విన్స్ అయితే టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంటుంది.
HO కోటా టికెట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి?
సాధారణ ప్రయాణీకులు ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు చీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్ కు అత్యవసర కోటా కింది ఫారమ్ ఫిల్ చేసి సమర్పించాలి. తన ప్రయాణానికి సంబంధించిన అత్యవసర పరిస్థితిని వివరించే డాక్యుమెంట్స్ ను చూపించాలి. దరఖాస్తు మీద గెజిటెడ్ అధికారి సంతకం చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఆ టికెట్ కు సంబంధించిన డేటా రైల్వే జోనల్ ఆఫీస్ కు ఫార్వర్డ్ అవుతుంది. అక్కడి ఈ దరఖాస్తు ఓకే అయిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. హ్యాపీగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది.
Read Also: బండరాళ్లతో రైలు అద్దాలు ధ్వంసం, యూపీలో రెచ్చిపోయిన ప్రయాణీకులు, వీడియో వైరల్!