Christmas offers : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ నుంచి వచ్చిన ఫ్లాగ్ షిప్స్‌లో గెలాక్సీ సిరీస్‌కు మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం శాంసంగ్ క్రిస్మస్ సేల్ జరుగుతోంది. ఈ స్పెషల్ ఆఫర్ సేల్‌లో మంచి ఎక్సైటింగ్ డిస్కౌంట్స్‌ను, స్పెషల్ డీల్స్‌ను అందిస్తోంది ఈ సంస్థ.
ఈ స్పెషల్ డిస్కౌంట్ అందిస్తున్న గ్యాడ్జెట్స్‌లో గెలాక్సీ వాచ్ అల్ట్రా, గెలాక్సీ బడ్స్ 3 ప్రో, రింగ్ ఇంకా ఇతర గెలాక్సీ వేరబుల్స్ ఉన్నాయి. అలానే డిసెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యలో గెలాక్సీ రింగ్ కొనుగోలు చేసిన వినియోగదారులకు 45 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ఫ్రీగా ఇస్తోంది. అసలు ధరతో పోలిస్తే ఈ ఆఫర్లో తక్కువ ధరకే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ లభిస్తున్నాయని చెప్పాలి. వీటితో పాటు అదిరిపోయే క్రిస్మస్ డీల్స్ సైతం ఉన్నాయి. ఇక కొనాలనుకునే కస్టమర్స్ ఓ లుక్కేయండి.
శాంసంగ్ క్రిస్మస్ సేల్‌లో ఉన్న డీల్స్ ఇవే (Samsung Christmas sale Offers) –
Galaxy Watch Ultra – ఈ గెలాక్సీ వాచ్ అల్ట్రాపై ఏకంగా రూ.12 వేల మాసివ్ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.12 వేలు క్యాష్ బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్ కింద రూ.10 వేలు దక్కుతుంది. అలానే కస్టమర్లు 24 నెల నో కాస్ట్ ఈఎమ్ఐ కూడా పొందవచ్చు.
Galaxy Buds 3 Pro – మీరు గెలాక్సీ బడ్స్ 3 ప్రో కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మంచి ప్రీమియమ్ ఆడియో క్వాలిటీ కలిగిన ఈ బడ్స్ కొనుగోలు చేస్తే ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోన్ లభిస్తుంది. దాదాపు రూ.5 వేల వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ దక్కుతుంది. పైగా నో కాస్ట్ ఈఎమ్ఐ వెసులుబాటు కూడా ఉంది.
Galaxy Watch 7 – ఈ శాంసంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ వాచ్‌పై రూ.8వేల క్యాష్ బ్యాక్ లేదా 24 నెలల నో కాస్ట్ ఈఎమ్ఐతో అప్‌గ్రేడ్ బోనస్ పొందవచ్చు.
Galaxy Buds 3 and Buds FE – గెలాక్సీ బడ్స్ 3కి అయితే రూ. 4వేల క్యాష్ బ్యాక్, 24 నెలల నో కాస్ట్ ఈఎమ్ఐ లభించగా, గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈకి రూ. 4వేల క్యాష్‌బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ అందుకునే వీలు కల్పించింది.
అదే మీరు శాంసంగ్ గెలాక్సీ జెడ్ సిరీస్ లేదా ఎస్ సిరీస్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మల్టీ బయ్ ఆఫర్స్‌పై రూ.18వేల వరకు పొందవచ్చు. మొత్తంగా కస్టమర్లు బ్యాంక్ డిస్కౌంట్స్, ఎక్సేంఛ్ ఆఫర్స్ దగ్గర తక్కువ ధరలకే ఈ ప్రొడక్ట్స్‌ను దక్కించుకోవచ్చు.
ఈ ఆఫర్స్ తో పాటు మిగిలిన ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై సైతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తున్నాయి. ఇక క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ ఆపై సంక్రాంతి ఫెస్టివల్ సేల్స్ ను సైతం త్వరలోనే ప్రారంభించినున్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం.. ఎప్పటినుంచో మీకు ఇష్టమైన లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ సేల్ లో కచ్చితంగా కొనేయండి.
ALSO READ : వాట్సాప్ చాట్ మరింత కొత్తగా! న్యూ ఇయర్ స్పెషల్ స్టిక్కర్స్.. స్పెషల్ థీమ్ తో!