భారతీయ రైల్వేకు ఎక్కువ ఆదాయాన్ని అందించడంలో సరుకు రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇస్తూనే, అదే సమయంలో సరుకు రవాణాకు తగిన ప్రాధాన్యత ఇస్తుంది ఇండియన్ రైల్వే. సరుకు రవాణాలో ఎక్కువ భాగం బొగ్గు రవాణా ఉంటుంది. దేశ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గును సమకూర్చడంలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2025 నాటికి, బొగ్గు రవాణా రైల్వే ఆదాయంలో సుమారు 45% ఉంది. ఈ రవాణా పర్యావరణ, ఆర్థిక, లాజిస్టిక్ సవాళ్లతో పాటు దేశ విద్యుత్ శక్తి భద్రతకు ఎంతో ముఖ్యమైనది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే సుమారు 817 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేశాయి. ఇది FY24లో 781 మిలియన్ టన్నులుగా ఉంది. ఏడాది కాలంలో ఏకంగా 16% పెరుగుదలను నమోదు చేసింది. రోజు వారీ సగటున 440 రేక్‌లు పవర్ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేస్తున్నాయి. ఒక్కో రేక్ సుమారు 4,000 నుంచి 4,500 టన్నుల బొగ్గును తీసుకెళ్తుంది. ఆదాయం పరంగా చూస్తే FY25లో రైల్వే ఫ్రీట్ ఆదాయం సుమారు రూ.2.62 లక్షల కోట్లు. ఇందులో బొగ్గు రవాణా ప్రధాన భాగంగా ఉంది.
బొగ్గు గనుల నుంచి రైలు వ్యాగన్లలో బొగ్గును తరలించే సమయంలో బొగ్గు మీద నీళ్లును చల్లుతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి చల్లే వ్యవస్థ కింది నుంచి బోగీలు వెల్లడం ద్వారా బొగ్గు బాగా తడిసిపోతుంది. అయితే, నీటిని చల్లడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
బొగ్గు లోడ్ చేసే సమయంలో, రవాణా సమయంలో గాలి వల్ల బొగ్గు ధూళి ఎగిరిపోతుంది. ఇది పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాక, ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. నీళ్లు చల్లడం వల్ల ధూళి తడిగా మారి ఎగరకుండా ఉంటుంది.
బొగ్గు ధూళి గాలిలో ఎగిరితే, అది రైలు యంత్రాంగం, సమీపంలోని విద్యుత్ లైన్లలో చేరి సాంకేతిక సమస్యలను సృష్టించవచ్చు. నీళ్లు చల్లడం దీనిని నివారిస్తుంది.
బొగ్గు సహజంగా మండే పదార్థం. అధిక ఉష్ణోగ్రతల్లో లేదంటే ఘర్షణ వల్ల బొగ్గు మంటలు చెలరేగే అవకాశం ఉంది. నీళ్లు చల్లడం వల్ల బొగ్గు తడిగా ఉండి, మంటలు రాకుండా నిరోధిస్తుంది.
Do you know why water is sprayed on coal during transportation? pic.twitter.com/ELVAjaMw1n
— Interesting As Fuck (@interesting_aIl) September 25, 2025
Read Also: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?
బొగ్గు ఎగిరిపోవడం వల్ల రవాణా సమయంలో కొంత బొగ్గు నష్టపోతుంది. నీళ్లు చల్లడం ద్వారా ఈ నష్టాన్ని తగ్గించవచ్చు. సాధారణంగా ఈ ప్రక్రియ పర్యావరణ రక్షణ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. రవాణా సమయంలో భద్రతను పెంచుతుంది.
Read Also: రైల్వే టికెట్ తో ఇన్ని ఫ్రీ సదుపాయాలా? అస్సలు ఊహించి ఉండరు!