E-Paper
Advertisement

బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైల్ రూట్ ఫిక్స్, స్టేషన్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే?

బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైల్ రూట్ ఫిక్స్, స్టేషన్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే?
Advertisement

Bengaluru-Hyderabad Bullet Train Alignment: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న బెంగళూరు-  హైదరాబాద్ బుల్లెట్ రైలు మార్గాలకు సంబంధించి ప్రాథమిక అలైన్‌ మెంట్లను భారతీయ రైల్వే విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును ప్రకటించిన మూడు నెలల తర్వాత మార్గాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైలు మార్గం

బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైలు మార్గం సుమారు 607 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ లైన్‌ లో దేవనహళ్లి విమానాశ్రయం, కోడిహళ్లి, అలీపూర్ లాంటి ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు. అనంతరం ఈ మార్గం ఆంధ్రప్రదేశ్‌ లోని హిందూపూర్, పెనుకొండ సమీపంలోని దుద్దెబండ, అనంతపురం, గూటీ, ధోన్, కర్నూలు మీదుగా తెలంగాణలోకి ప్రవేశించి మన్ననూరు, భారత్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం గుండా హైదరాబాద్‌ కు చేరుకుంటుంది. బెంగళూరులో ప్రధాన రవాణా కేంద్రంగా ఉన్న మెజెస్టిక్ ప్రాంతానికి ఈ రెండు కారిడార్లలో ఏదీ కనెక్ట్ కాకపోవడం పట్ల రైల్వే కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరు- చెన్నై హైస్పీడ్ రైలు మార్గం

Advertisement

ఇక బెంగళూరు- చెన్నై హైస్పీడ్ రైలు మార్గం మొత్తం 306 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ లైన్ బెంగళూరులోని బైయప్పనహళ్లి దగ్గర ప్రారంభమై వైట్‌ ఫీల్డ్, కోడిహళ్లి, కోలార్ మీదుగా సాగుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లోని చిత్తూరు, తమిళనాడులోని పరందూర్, పూనమల్లి గుండా వెళ్లి చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. చెన్నై సమీపంలో ప్రతిపాదిత రెండో విమానాశ్రయం నిర్మించనున్న పరందూర్ ప్రాంతంలో కూడా స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్గంలో కర్ణాటకలో సుమారు 100 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉండగా,  దీని కోసం పెద్ద ఎత్తున భూసేకరణ అవసరం అవుతుంది. బెంగళూరు సిటీ పరిధిలో ఈ కారిడార్ దాదాపు 16 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం గుండా వెళ్తుంది. మిగతా ప్రాంతాల్లో ఎలివేటెడ్ ట్రాక్‌ లను ఏర్పాటు చేయనున్నారు.

బెంగళూరు-మైసూరు హైస్పీడ్ రైల్వే మార్గం

మరోవైపు బెంగళూరు-మైసూరు హైస్పీడ్ మార్గానికి సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలో మాండ్య, రామనగర, కెంగేరి, ఎలక్ట్రానిక్స్ సిటీ ప్రాంతాల్లో స్టేషన్లు ఉండేలా ప్లాన్ చేశారు. ఈ లైన్ కోడిహళ్లి వద్ద చెన్నై కారిడార్‌తో కలిసేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ అమలు చేయనుంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో సర్వేలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక పనులు 2027-28 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బుల్లెట్ రైలు ప్రారంభమైన తర్వాత బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 1 గంట 13 నిమిషాల్లో, హైదరాబాద్‌కు 2 గంటల్లో చేరుకోవచ్చు. ఈ మార్గాల్లో భారత్‌ లో తయారవుతున్న B-28 హైస్పీడ్ రైళ్లు నడపాలని రేల్వేశాఖ భావిస్తోంది. అయితే, భూసేకరణ, సాంకేతిక సవాళ్లు, భారీ ఖర్చుల కారణంగా ఈ ప్రాజెక్టులు పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement

Read Also: రూ. 23,437 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఏపీ, తెలంగాణకు గుడ్ న్యూస్!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×