Train Ticket Booking Rules: భారతీయ రైల్వే సంస్థ రోజూ దేశ వ్యాప్తంగా వేలాది రైళ్లను నడుపుతుంది. లక్షలాది మంది ప్రయాణీకులు గమ్య స్థానాలకు చేర్చుతుంది. అయినప్పటికీ, చాలా మందికి కన్ఫార్మ్ టికెట్లు దొరకడం లేదు. హోలీ, దసరా, దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగల సీజన్ లో రైళ్లలో రద్దీ విపరీతంగా ఉంటుంది. టికెట్లు దొరకడం చాలా కష్టం. అయితే, చార్ట్ రెడీ అయిన తర్వాత కూడా కన్ఫార్మ్ టికెట్లు పొందే అవకాశం ఉందనే విషయం చాలా మంది ప్రయాణీకులకు తెలియదు. అందుకే, రైళ్లలో సీట్లు ఉన్నా చాలా మంది వాటిని పొందలేకపోతున్నారు. చార్ట్ రెడీ అయిన తర్వాత రైల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
IRCTC యాప్, వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోండి!
సాధారణంగా రైలు బయల్దేరే కొద్ది గంటల ముందు ఛార్ట్ ప్రిపేర్ అవుతుంది. ఆ తర్వాత రైల్లో ఖాళీ సీటును గుర్తించే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
⦿ మీ మొబైల్ ఫోన్ లో లేదంటే కంప్యూటర్ లో ముందుగా IRCTC యాప్ లేదంటే వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
⦿ మీ ID, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
⦿ హోమ్ పేజీలో ‘ట్రైన్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి.
⦿ ఇప్పుడు ‘చార్ట్ వేకెన్సీ’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి.
⦿ ఆ తర్వాత ‘చార్ట్ వేకెన్సీ’ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
⦿ అనంతరం రైలు నంబర్, ప్రయాణ తేదీ, స్టేషన్ పేరు ఎంటర్ చేసి ‘గెట్ ట్రైన్ చార్ట్’పై ట్యాప్ చేయాలి.
⦿ మీకు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, థర్డ్ ఎకానమీ, స్లీపర్ క్లాస్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
⦿ ఇప్పుడు మీరు ఖాళీ సీట్లను గుర్తించాలనుకుంటున్న క్లాస్ మీద క్లిక్ చేయాలి.
⦿ ఉదాహరణకు, మీరు థర్డ్ ఏసీ క్లాస్‌లో ఖాళీ సీటును కనుగొనాలనుకుంటే, థర్డ్ ఏసీపై క్లిక్ చేయండి.
⦿ ఇప్పుడు థర్డ్ ఏసీలో ఖాళీగా ఉన్న అన్ని సీట్ల వివరాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
⦿ ఎక్కడి నుంచి ఏ కోచ్ లో, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను అన్నీ తెలుస్తాయి.
⦿ ఇక మీకు నచ్చిన సీటును బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ టికెట్లు కచ్చితంగా కన్ఫార్మ్ అవుతాయి.
⦿ మీరు నిశ్చింతగా ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.
Read Also: ఇండియాలో ఫాస్టెస్ట్ రైలు ఇదే! ఎంత వేగంతో దూసుకెళ్తుందో తెలుసా?
పేటీఎం, మేక్ మై ట్రిప్ లాంటి ట్రావెల్ ఏజెన్సీలు కూడా కన్ఫార్మ్ టికెట్లను అందించే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే, ఛార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కన్ఫార్మ్ టికెట్లను పొందే అవకాశం రైల్వే అధికారిక వెబ్ సైట్ IRCTCలో మాత్రమే అందుబాటులో ఉంది.
Read Also: ఇకపై రిజర్వేషన్ కోచ్‌లతో సమానంగా జనరల్ కోచ్‌లు, గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి