BigTV English

Vande Bharat Express – Duronto – Rajdhani: ఇండియాలో ఫాస్టెస్ట్ రైలు ఇదే! ఎంత వేగంతో దూసుకెళ్తుందో తెలుసా?

Vande Bharat Express – Duronto – Rajdhani: ఇండియాలో ఫాస్టెస్ట్ రైలు ఇదే! ఎంత వేగంతో దూసుకెళ్తుందో తెలుసా?

Indian Fastest Train: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి రోజు సుమారు 25 వేల రైళ్లు తమ సేవలను అందిస్తున్నాయి. 10 వేల రైళ్లు ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చేందుకు నడిపిస్తుండగా, మరో 10 వేల రైళ్లు సరకు రవాణాకు వాడుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ లోని ఒక రాష్ట్రం మినహా మిగతా అన్ని రాష్ట్రాలకు రైల్వే లైన్లు ఉన్నాయి. భారత్ లో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు కొన్ని ఉన్నాయి. వాటిలో టాప్ స్పీడ్ తో వెళ్లే ట్రైన్ ఏది? మిగతా రైళ్లు ఎంత స్పీడ్ ఎంత? అనేది చూద్దాం..


భారత్ లో అత్యంత వేగంగా నడిచే రైలు వందేభారత్

దేశంలో ప్రస్తుతం అత్యంత వేగంగా నడిచే రైలుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ గుర్తింపు తెచ్చుకుంది. భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చిన ఈ రైలు.. తొలిసారి 2019లో పట్టాలెక్కింది. ఈ సెమీ హైస్పీడ్ రైలు గంటకు 180 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా ట్రాక్‌లపై గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. ఈ రైలు ప్రయాణ సమయాన్ని 15 శాతం తగ్గిస్తుంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ రైలును తయారు చేశారు. వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ లో ప్రయాణీకులు అద్భుతమైన వసతులు కల్పిస్తున్నారు. ఆన్‌బోర్డ్ Wi-Fi, GPS-ఆధారిత సమాచార వ్యవస్థలు, ఆటోమేటిక్ డోర్లతో పాటు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి.


భారత్ లో సెకెండ్ ఫాస్టెస్ట్ రైలు తేజస్ ఎక్స్‌ ప్రెస్

భారతీయ రైల్వే సంస్థ  2017లో తేజస్ ఎక్స్‌ ప్రెస్‌ ను ప్రారంభించింది. ఇది సెమీ హై స్పీడ్ రైలుగా రూపొందింది.  పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలు. భారతదేశంలో నడుస్తున్న మూడు సెమీ హై స్పీడ్ రైళ్లలో ఇదొకటి. ఇది కూడా లేటెస్ట్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ముంబై- గోవా మధ్య ఉన్న 551 కిలో మీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 8.5 గంటల్లో చేరుకుంటుంది. తేజస్ ఎక్స్ ప్రెస్ లక్నో- ఆనంద్ విహార్ టెర్మినల్ తో పాటు న్యూఢిల్లీ- చండీగఢ్ రూట్లలోనూ సేవలను అందిస్తుంది. తేజస్ ఎక్స్‌ ప్రెస్ సగటు వేగం గంటకు 110 కిలో మీటర్లు. గరిష్ట వేగం గంటకు 162 కి.మీ.

Read Also: పాక్‌లో ఆగిన రైళ్లు.. ఆన్‌లైన్ బుకింగ్స్ కూడా బంద్, నరకమంటే ఇదే!

భారత్ లో టాప్ 10 ఫాస్టెస్ట్ రైళ్లు

⦿వందే భారత్ ఎక్స్‌ ప్రెస్- ట్రైన్ 18- 180 కి.మీ/గం

⦿గతిమాన్ ఎక్స్‌ ప్రెస్- 160 కి.మీ/గం

⦿శతాబ్ది ఎక్స్‌ ప్రెస్- 150 కి.మీ./గం

⦿ రాజధాని ఎక్స్‌ ప్రెస్- 140 కి.మీ/ గం

⦿రాజధాని, దురంతో ఎక్స్‌ ప్రెస్-135 కిమీ/గం

⦿నిజాముద్దీన్ AC సూపర్ ఫాస్ట్-130 కిమీ/గం

⦿అహ్మదాబాద్ AC డబుల్ డెక్కర్-130 కిమీ/గం

⦿యువ ఎక్స్‌ ప్రెస్- 120- 130 కి.మీ/గం

⦿సంపర్క్ క్రాంతి ఎక్స్‌ ప్రెస్-110 కిమీ/గం

⦿జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12059), 110 కి.మీ/గం

Read Also: ఇకపై రిజర్వేషన్ కోచ్‌లతో సమానంగా జనరల్ కోచ్‌లు, గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి

Related News

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Big Stories

×