Actress Sneha: ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లిళ్లు, ప్రేమలు, విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎవరు ఎప్పుడు ప్రేమించుకుంటున్నారో, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో.. ఎందుకు విడాకులు తీసుకొని విడిపోతున్నారో ఎవరికి అర్థం కాకుండా అయిపోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఒక్క ఏడాది కూడా సంతోషంగా ఉండలేకపోతున్నారు. అభిప్రాయ భేదాల వలన కేవలం సంవత్సరం కూడా కలిసి ఉండలేకపోతున్నారు. సొంత నిర్ణయాలు తీసుకుంటూ విడాకులు ప్రకటిస్తూ మరొకరితో కొత్త జీవితాన్ని పంచుకుంటున్నారు.
ఇక ఈ ఏడాది సెలబ్రిటీలు ఎంతమంది అయితే పెళ్లిళ్లు చేసుకున్నారు అంతకంటే ఎక్కువమంది సెలబ్రిటీలు విడాకులను ప్రకటించారు. జయం రవి, జీవి ప్రకాష్, ఏఆర్ రెహమాన్ ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో ఏళ్ల వివాహ బంధాన్ని ఈ ఏడాది అధికారికంగా ముగించారు. ఇప్పుడు సెలబ్రిటీల జీవితాలు ఎలా మారిపోయాయి అంటే భార్య భర్తలు కనుక ఒక రెండు వారాలు కలిసి కనిపించకపోయినా, సోషల్ మీడియాలో కలిసి ఉన్నట్టు ఫోటోలు పెట్టకపోయినా.. వారిద్దరూ విడిపోయారు.. విడాకులు తీసుకుంటున్నారు అంటూ పుకార్లు పుట్టించేస్తున్నారు.
Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి ఎప్పుడో తెలుసా.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
ఇక ఇలాంటి విడాకుల రూమర్స్ నటి స్నేహ కూడా ఎదుర్కొంటూ వస్తుంది. మనసున ఉన్నది.. చెప్పాలని ఉన్నది అంటూ తెలుగు ప్రేక్షకుల్ని తన అందంతో కట్టిపడేసిన హీరోయిన్ స్నేహ. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కోలీవుడ్ నటుడు ప్రసన్నను వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న స్నేహ ఈమధ్యనే నటిగా రీఎంట్రీ ఇచ్చింది.
అన్ని భాషల్లో స్నేహ హీరోలకు అక్కగా వదినగా కీలకపాత్రలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఇకపోతే కొన్ని నెలల క్రితం స్నేహ.. తన భర్త ప్రసన్నకు విడాకులు ఇస్తుందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఉండడం లేదని సోషల్ మీడియాలో పుకార్లు రేగాయి. అయితే ఆ తర్వాత ఆ పుకార్లను స్నేహ- ప్రసన్న కొట్టిపడేశారు. తామిద్దరూ కలిసే ఉంటున్నామని ఫొటోలను షేర్ చేసి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
Sobhita Wedding Saree Cost: పెళ్లిలో అక్కినేని కోడలు ధరించిన చీర.. నగల ధర ఎంతో తెలుసా.. ?
ఇక తాజాగా స్నేహ.. చీరల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. స్నేహాలయం అనే పేరుతో చీరల వ్యాపారం స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే స్నేహ- ప్రసన్న మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఒక రిపోర్టర్ ఇండస్ట్రీలో పెరుగుతున్న విడాకుల పరంపర గురించి ప్రశ్నించగా.. స్నేహ- ప్రసన్న తమదైన రీతిలో సమాధానం ఇచ్చారు.
” విడాకులు అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది మనం చెప్పలేము. అది తెలియనప్పుడు.. వాటి గురించి, వారి గురించి స్పందించే అధికారం మాకు లేదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు.. స్నేహ- ప్రసన్న మంచి జోడి అని వారు ఎప్పుడూ కలకాలం కలిసే ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి నటిగా సక్సెస్ అయిన స్నేహ.. బిజినెస్ లో కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.