Vande Bharat Window Seat: చాలా మందికి విండో సీట్ అంటే చాలా ఇష్టం. ప్రయాణ సమయంలో హాయిగా బయటకు చూస్తూ హ్యాపీగా జర్నీ చెయ్యొచ్చు. కొన్నిసార్లు ఇతరుల నుంచి విండో సీట్ పొందేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా వందేభారత్ లో ఓ మహిళ విండో సీట్ కోసం చేసిన ప్రయత్నాలను ఓ వ్యక్తి రెడ్డిట్ వేదికగా పూసగుచ్చినట్లు వెల్లడించాడు. సీటు పొందేందుకు చెప్పే కారణాలనూ ఆయన వివరించే ప్రయత్నం చేశాడు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా ఓ ప్రయాణీకుడు వందేభారత్ రైలు ఎక్కాడు. తనకు కేటాయించిన విండో సీట్ లో కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. కొన్ని స్టాప్ ల తర్వాత ఓ 40 ఏళ్ల మహిళ రైలు ఎక్కింది. ఆమె ఓ పెద్ద ట్రాలీ బ్యాగ్ ను తీసుకొచ్చింది. దానితో పాటు మరో రెండు అదనపు బ్యాగులు తెచ్చుకుంది. ఆమె కూర్చుకున్నప్పటి నుంచి మర్యాద పూర్వకంగా నవ్వడం మొదలుపెట్టింది. చిన్నగా మాట్లాడ్డానికి ప్రయత్నించింది. కిటికీలో నుంచి చూస్తూ ఉంది. ఎలాగైనా సీటు మార్చుకుందామని అడుగుతుందనే ఉద్దేశంతో సదరు ప్రయాణీకుడు హెట్ ఫోన్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నట్లు నడించాడు. చివరికి ఆ మహిళ అనారోగ్యంతో ఉన్నట్లు నటిస్తూ.. ఎదురుగా ఉన్న మహిళతో విండో సీటు ఇవ్వాలని కోరింది. ఆమె నో చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళ ఆమె తన భర్తకు దగ్గరగా కూర్చోవడానికి సీటు మార్చుకుందామని అడుగుతుంది. అయితే, ఆ సీటు నెక్ట్స్ స్టాప్ లో ఎక్కే ప్రయాణీకుడికి రిజర్వ్ చేయబడిందని మరో మహిళ చెప్తుంది.
చివరకు సదరు ప్రయాణీకుడి వంతు వచ్చింది!
ఎవరూ ఆమెకు విండో సీటు ఇచ్చేందుకు నో చెప్పడంతో.. చివరకు పక్కనే ఉన్న వ్యక్తి భుజం తట్టింది. “నీ సీటు నాకు ఇవ్వగలవా?” అన్నది. “ఎందుకు?” అని నేను అడిగాను. ఆమె “నాకు బాగా లేదు, నాకు కొంచెం వికారం అనిపిస్తుంది” అని చెప్పింది. “ఈ విండో ఓపెన్ కాదు. కిటికి తెరవడానికి వీలు లేదు. మీరు అనారోగ్యంగా అనిపించినా, కిటికీ సహకరించదు” అని చెప్పాను. అయినా ఆమె అప్పుడు కూడా “ఈ విండో సీటు నీకు అవసరం” అని చెప్పింది. అప్పుడు నాకు అర్థం అయ్యింది. కొంత మంది తమకు కావాల్సిన దాన్ని పొందేందుకు ఆరోగ్యం బాగా లేదు, మహిళలం, వృద్ధులం అనే సానుభూతి కార్డులు ప్లే చేస్తారు. కానీ, నేను ఆమె ఏం చెప్పినా, “క్షమించండి, నేను సీటు మార్చుకోలేను” అని చెప్పేశాను. ఈ రెడ్డిట్ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “మంచి పని చేశారు. ఇకపై కూడా ఇలాగే చేయండి. విండో సీటు కోసం చాలా మంది రకరకాల జిమ్మిక్కులు చేస్తారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.
Read Also: ఇండియన్ బుల్లెట్ రైలుకు.. చైనా రెడ్ సిగ్నల్.. అవి ఇవ్వలేమంటూ పేచీ!