E-Paper
Advertisement

Free Food In Train: దశాబ్దాలుగా ఫ్రీ ఫుడ్ అందిస్తున్న ఈ రైలు గురించి మీకు తెలుసా?

Free Food In Train: దశాబ్దాలుగా ఫ్రీ ఫుడ్ అందిస్తున్న ఈ రైలు గురించి మీకు తెలుసా?
Advertisement

Indian Railways: భారతీయ రైల్వేలోని పలు రైళ్లలో ఉచితంగా భోజనం అందిస్తారు. ఇందుకోసం టికెట్ కొనుగోలు  సమయంలోనే భోజనానికి డబ్బులు తీసుకుంటారు. లేదంటే, ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వారికి కాంప్లిమెంటరీగా ఉచిత భోజనం అందిస్తారు. ఒకవేళ రైలు ప్రయాణంలో ఆహారం కావాలనుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫుడ్ ఏసీ, స్లీపర్ క్లాసు ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనరల్ కోచ్ లలో ప్రయాణించే వాళ్లు తక్కువగా ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. సాధారణంగా రైళ్లు ప్యాంట్రీ సేవల ద్వారా ఆహారాన్ని అందిస్తాయి. లేదంటే, ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో ఆహారాన్ని కొనుగోలు చేస్తారు. కానీ, ప్రయాణీకులందరికీ ఉచితంగా ఫుడ్ అందించే ఓ ప్రత్యేక రైలు ఉంది. ఇంతకీ దాని పేరు ఏంటి? ఏ రూట్ లో నడుస్తుందో తెలుసా?

ఉచితంగా ఆహారం అందించే ఏకైక రైలు

Advertisement

తన ప్రయాణీకులందరికీ ఉచితంగా భోజనం అందించే ఏకైక రైలు సచ్‌ ఖండ్ ఎక్స్‌ ప్రెస్‌(రైలు నెంబర్ 12715). ఈ రైల్లో ప్రయాణించే ప్యాసింజర్లు ఫుడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే, ఈ రైల్లో ప్రయాణించే వారందరికీ ఫ్రీగా ఫుడ్ అందిస్తారు. చాలా సంవత్సరాలుగా ఈ రైలులో ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్ ద్వారా ప్రయాణీకులకు భోజనం వడ్డిస్తున్నారు. ఈ రైలు తన ప్రయాణంలో మొత్తం 39 స్టేషన్లలో ఆగుతుంది. వీటిలో ఆరు స్టేషన్లలో ప్రయాణీకులకు ఉచిత భోజనం అందిస్తారు. ప్రయాణీకులు ఆహారాన్ని తినేందుకు వీలుగా రైలు తగినంత సేపు ఆగుతుంది.

అమృత్ సర్- నాందేడ్ మధ్య ప్రయాణం

Advertisement

సచ్‌ ఖండ్ ఎక్స్‌ ప్రెస్ పంజాబ్ లోని అమృత్‌ సర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ మధ్య నడుస్తుంది. ఈ రైలు రెండు ముఖ్యమైన సిక్కు మత ప్రదేశాలను కలుపుతుంది. అమృత్‌ సర్‌ లోని శ్రీ హర్మందిర్ సాహిబ్,  నాందేడ్‌ లోని శ్రీ హజుర్ సాహిబ్ హరిద్వారాలను లింక్ చేస్తుంది. ఈ ప్రయాణం 2,081 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ప్రయాణ సమయంలో ఆరు స్టేషన్లలో ఉచితంగా భోజనం అందిస్తారు. రైలులో ప్యాంట్రీ ఉన్నప్పటికీ, ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్ ప్రతి ఒక్క ప్రయాణీకుడికి భోజనం అందిస్తారు.

Read Also: ఆకట్టుకునే జలపాతాలు, ఆహా అనిపించే మంచుకొండలు.. జీవితంలో ఒక్కసారైనా ఈ రైలు ప్రయాణాలు చేయాల్సిందే!

మూడు దశాబ్దాలుగా ఉచిత భోజనం

గత మూడు దశాబ్దాలుగా ఈ రైలు తన ప్రయాణీకులకు ఉచితంగా భోజనం అందిస్తున్నది. ఏసీ, స్లీపర్ క్లాసులతో పాటు జనరల్ కోచ్ లో ప్రయాణించే వారికి కూడా తిన్నంత భోజనం అందిస్తారు. కధీ- చావల్, పప్పు, కూరగాయలతో కూడిన భోజనాన్ని అందిస్తారు. ప్రతిరోజూ సుమారు 2,000 మందికి ఉచిత ఆహారం అందిస్తారు. ఈ సంప్రదాయం 1995లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉచిత ఆహారం అందిస్తున్నారు. దేశంలో ప్రయాణీకులందరికీ ఉచితంగా భోజనం అందించే రైలుగా సచ్‌ ఖండ్ ఎక్స్‌ ప్రెస్ గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: మార్చి- ఏప్రిల్ నెలల్లో నడిచే స్పెషల్ రైళ్లు ఇవే, ఏ రైళ్లను క్యాన్సిల్ చేశారంటే?

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×