Gutta Jwala.. టాలెంటెడ్ అండ్ యంగ్ హీరో నితిన్ (Nithin) తాజాగా నటిస్తున్న చిత్రం రాబిన్ హుడ్(Robinhood) మార్చి 28న చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. వెంకీ కుడుముల(Venky kudumula) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీ లీల (SreeLeela ) హీరోయిన్ గా నటించగా.. కేతిక శర్మ (Kethika Sharma) స్పెషల్ సాంగులో నటించింది. ఇకపోతే కేతిక శర్మ ఈ సాంగ్ కోసం చేసిన హుక్ స్టెప్ ఎంతలా వైరల్ అయిందో.. అంతే విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) అందించిన కొరియోగ్రఫీ పై కూడా విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలోనే నితిన్ చాలా ఏళ్ల క్రితం నటించిన ఒక సినిమాలోని ఐటమ్ సాంగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నితిన్ కోసమే ఆ సాంగ్ లో చేశాను – గుత్తా జ్వాల..
అసలు విషయంలోకెళితే.. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ ఇక ఇండస్ట్రీకి దూరం అవుదాం అనుకున్న సమయంలోనే.. ‘ఇష్క్’ సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవడమే కాకుండా నితిన్ కి మంచి బూస్ట్ అందించింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో నటించారు. ఇందులో నితిన్ – నిత్యామీనన్(Nithya Menon) మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. ఇకపోతే ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఇందులో ఉన్న ఐటమ్ సాంగ్. ఇందులో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల (Gutta Jwala) నటించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఐటమ్ సాంగ్ చేయడం ఇష్టం లేకపోయినా నితిన్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, అతని కోసమే ఈ ఐటమ్ సాంగ్ లో చేశానని అప్పట్లోనే చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఆ సాంగ్ గురించి, అలాగే తెలుగు ఇండస్ట్రీ గురించి పలు కామెంట్లు చేసింది.
టాలీవుడ్ కి అమ్మాయిలు తెల్లగా ఉంటే చాలు..
గుత్తా జ్వాల మాట్లాడుతూ.. “నేను సినిమా మెటీరియల్ కాదు.. నితిన్ కంటే ముందు కొంతమంది సినిమాలలో నటించమని ఆఫర్ వచ్చినా.. నేను పట్టించుకోలేదు. ముఖ్యంగా మన టాలీవుడ్ గురించి అందరికీ తెలిసిందే కదా.. తెల్ల అమ్మాయి అయితే చాలు ఇంకేమీ పట్టించుకోరు” అంటూ తెలుగు ఇండస్ట్రీపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది గుత్తా జ్వాల. ఇక అదే సమయంలో ఆమె మాట్లాడుతూ.. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంలో ఆ సాంగ్ వల్ల జరిగిన ఒకే మంచి పని నితిన్ అప్పటివరకు నటించిన చిత్రాలు ఆయనకు గుర్తింపు ఇవ్వలేదు.. కానీ నా వల్లే ఆయనకి హిట్ వచ్చింది. పైగా నా సాంగ్ వల్లే ఆ మూవీ నేషనల్ మీడియాలోకి కూడా వెళ్ళింది” అంటూ గుత్తా జ్వాల తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక గుత్తా జ్వాల విషయానికి వస్తే.. ఈమె గతంలోనే చేతన్ ఆనంద్ ను వివాహం చేసుకోగా.. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇక 2021లో తమిళ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.