భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులు ఆహ్లాదకరంగా జర్నీ చేసేందుకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది. పండుగలు, సెలవుల సందర్భంగా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచుతుంది. హోలీ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సుమారు 400 పైగా ప్రత్యేక రైళ్లను నడిపించింది. పలు కారణాలతో దేశ వ్యాప్తంగా పలు రైళ్లను రద్దు చేసింది. మార్చి- ఏప్రిల్ నెలలో ప్రత్యేక రైళ్లు, క్యాన్సిల్ చేసిన రైళ్లకు సంబంధించిన రైళ్ల వివరాలను రైల్వే సంస్థ ప్రకటించింది. వీటిలో మీరు వెళ్లాల్సిన రైళ్లు ఉన్నాయేమో ఓసారి చూసుకోండి.
మార్చి- ఏప్రిల్ నెలలో నడిచే ప్రత్యేక రైళ్లు
⦿ పాట్నా-చర్లపల్లి స్పెషల్ (రైలు నంబర్ 0325)
ఈ రైలు మార్చి 19 నుంచి మే 28 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సోమవారం, బుధవారం పాట్నా నుంచి బయల్దేరుతుంది. పాట్నా నుంచి చర్లపల్లికి మొత్తం 22 ట్రిప్పులు వేయనుంది.
⦿ చర్లపల్లి-పాట్నా స్పెషల్ (రైలు నంబర్ 07255)
ఈ రైలు మార్చి 19 నుంచి మే 28 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి బుధవారం చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. ఈ ప్రత్యేక రైలు మొత్తం 11 ట్రిప్పులు వేయనుంది.
⦿ చర్లపల్లి-పాట్నా స్పెషల్ (రైలు నంబర్ 07256)
ఈ రైలు మార్చి 21 నుంచి మే 30 వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మొత్తం 11 ట్రిప్పులు వేయనుంది. .
⦿ విశాఖపట్నం-పాట్నా స్పెషల్(రైలు నంబర్ 08537)
ఈ రైలు మార్చి 23, 30 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నం నుంచి సాయంత్రం 7:30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 9:00 గంటలకు పాట్నాకు చేరుకుంటుంది.
⦿ పాట్నా-విశాఖపట్నం స్పెషల్(రైలు నంబర్ 08538)
ఈ రైలు మార్చి 24, 31వ తేదీల్లో అందుబాటులో ఉంటుంది. పాట్నా నుంచి రాత్రి 10:30 గంటలకు బయల్దేరి, మూడవ రోజు ఉదయం 3:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. వీటితో పాటు దేశ వ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది.
Read Also: రైల్వే టికెట్లపై కేంద్ర సబ్సిడీ, వామ్మో అంత శాతం ఇస్తుందా?
మార్చి-ఏప్రిల్ నెలల్లో క్యాన్సిల్ అయిన రైళ్లు
డబ్లింగ్, ఇంటర్ లాకింగ్ తో పాటు పలు రైల్వే వ్యవస్థల అప్ గ్రేడ్ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. మెయింటెనెన్స్ పనుల కారణంగా పలు రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపింది. క్యాన్సిల్ అయిన రైళ్లలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి రాకపోకలు కొనసాగించే రైళ్లే ఉన్నాయి.
ప్రత్యేక, క్యాన్సిల్ రైళ్ల వివరాలు ఎలా తెలుసుకోవాలంటే?
భారతీయ రైల్వే మార్చి, ఏప్రిల్ నెలల్లో నడుపుతున్న ప్రత్యేక రైళ్లు, క్యాన్సిల్ అయిన రైళ్ల వివరాలను భారతీయ రైల్వే అధికారిక వెబ్ సైట్ IRCTC ద్వారా తెలుసుకోవాలని వెల్లడించింది. లేదంటే రైల్వే ప్రయాణీకుల హెల్ప్ లైన్ నంబర్ 139కి కాల్ చేయడం ద్వార వివరాలు పొందవచ్చని తెలిపింది. లేదంటే, సమీపంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లి తెలుసుకోవాలని సూచించింది.
Read Also: వందే భారత్ టికెట్ ధరలు తగ్గింపు? ఇక వారికీ లగ్జరీ రైలు సదుపాయం!
Read Also: ఆకట్టుకునే జలపాతాలు, ఆహా అనిపించే మంచుకొండలు.. జీవితంలో ఒక్కసారైనా ఈ రైలు ప్రయాణాలు చేయాల్సిందే!