BigTV English

Building Rotation: 8 అంతస్తుల భవనాన్ని అవలీలగా పక్కకు జరిపేశారు.. చరిత్రలోనే అద్భుతం

Building Rotation: 8 అంతస్తుల భవనాన్ని అవలీలగా పక్కకు జరిపేశారు.. చరిత్రలోనే అద్భుతం

బిల్డింగ్ లిఫ్టింగ్. ఈ టెక్నాలజీ గురించి మనకు తెలుసు. రోడ్డుకంటే మరీ కిందకు ఉండిపోయిన బిల్డింగ్ లను కొన్ని అడుగుల మేర పైకి ఎత్తేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ముందుగా పునాదితో దానికి సంబంధం తొలగించి, జాకీలతో దాన్ని కాస్త పైకి ఎత్తి పెట్టి ఆ తర్వాత కింద బేస్ మెంట్ నిర్మిస్తారు. దీంతో మనం కోరుకున్నన్ని అడుగుల మేర భవనం పైకి లేచినట్టవుతుంది. ఈ టెక్నాలజీతో కొన్ని సందర్భాల్లో బిల్డింగ్ ని కొంత పక్కకు కూడా జరుపుతుంటారు. ఇప్పుడేదో జాకీలతో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని మనం అనుకుంటున్నాం కానీ.. 1930లోనే ఇలా ఒక బిల్డింగ్ ని పక్కకు జరిపింది ఇండియానా బెల్ టెలిఫోన్ కంపెనీ. అలాంటిలాంటి బిల్డింగ్ కాదు 8 అంతస్తుల భారీ భవనాన్ని 90 డిగ్రీస్ కోణంలో పక్కకు జరిపారు. ఆనాడే ఇది ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచింది. ఈనాటికీ ఇండియానా బెల్ టెలిఫోన్ కంపెనీ బిల్డింగ్ షిఫ్టింగ్ పై లెక్కలేనన్ని కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. గూగుల్ లో లెక్కలేనన్ని ఫొటోలు, వీడియోలు కనపడతాయి.


బిల్డింగ్ షిఫ్టింగ్..
బిల్డింగ్ ని పైకి ఎత్తడం, కాస్త పక్కకు జరపడం సాహసం అనుకుంటే.. దాన్ని కొన్ని అడుగుల మేర పక్కకు జరిపడం నిజంగా సంచలనమే. అంతే కాదు, బిల్డింగ్ ని పక్కకు జరిపే సమయంలో అందులో పనులున్నీ యథాప్రకారం జరిగిపోయాయి. అంటే కంపెనీ సేవల్ని నిలిపివేయకుండా పని పూర్తి చేశారు. దాదాపు నెలరోజులపాటు ఈ ప్రయాణం సాగింది.

అమెరికాలోని ఇండియానా రాష్ట్ర రాజధాని ఇండియానా పోలీస్ లో ఈ బిల్డింగ్ షిఫ్టింగ్ జరిగింది. అక్కడి సెంట్రల్ యూనియన్ టెలిఫోన్ కంపెనీని ఇండియానా బెల్ టెలిఫోన్ కంపెనీ కొనుగోలు చేసింది. పాత సంస్థ ఉపయోగించిన బిల్డింగ్ ని కొత్త కంపెనీ తన హెడ్ క్వార్టర్స్ గా ఉపయోగించుకోవాలనుకుంది. అయితే అక్కడ సరిపోయే స్థలం ఉన్నా.. అందులో బిల్డింగ్ మాత్రం చిన్నది. అందులోనూ అది ఆ ఖాళీ స్థలానికి మధ్యలో ఉంది. అందుకే దాన్ని తొలగించి కొత్త బిల్డింగ్ నిర్మించాలని మొదట అనుకున్నారు. అయితే దీనివల్ల రెండు నష్టాలున్నాయి. పాత బిల్డింగ్ పడేయడానికి, కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. రెండోది.. కొత్త బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యే వరకు వారి ఆఫీస్ పనులకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఈ రెండిటికీ ప్రత్యామ్నాయం ఆలోచించింది. బెల్ టెలిపోన్ కంపెనీ. ఆ బిల్డింగ్ ని అలాగే ఉంచేసి కొత్త భవనం నిర్మించాలనుకున్నారు. బిల్డింగ్ షిఫ్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి దాన్ని 90 డిగ్రీల కోణంలో పక్కకు జరిపారు.


8 అంతస్తుల ఎత్తు. 11వేల టన్నుల బరువైన బిల్డింగ్ అది. దాన్ని ముందుగా 16మీటర్లు దక్షిణం వైపు జరిపారు. ఆ తర్వాత 30 మీటర్ల పడమరకు జరిపారు. దీనికోసం 600మంది వర్కర్లు, దాదాపు నెలరోజులపాటు పనిచేశారు. బిల్డింగ్ లను జరుపుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా టెలిఫోన్ వైర్లను మార్చారు. అంటే నెలరోజులపాటు లోపల ఉద్యోగులు పనిచేసుకుంటూనే ఉన్నారు. బయట కార్మికులు దాన్ని జాగ్రత్తగా అంగుళం, అంగుళం, పక్కకు జరుపుతూ అనుకున్న స్థానానికి చేర్చారు. ఈ ప్రాజెక్టును వోన్నెగట్, బోన్ & ముల్లెర్ సంస్థ పూర్తి చేసింది. ఆర్కిటెక్ట్ కర్ట్ వోన్నెగట్ సీనియర్.. ప్రధాన ఇంజినీర్ గా పనిచేశారు. బిల్డింగ్ ఏమాత్రం చెక్కుచెదరకుండా దాని స్థానాన్ని మార్చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు వోన్నెగట్.

హైడ్రాలిక్ జాకీలను ఉపయోగించి భవనాన్ని నేలపై నుండి కొద్దిగా ఎత్తి, బలమైన రోలర్లపై ఉంచి, నెమ్మదిగా దాని కొత్త స్థానానికి జరుపుకుంటూ వెళ్లారు. గంటకు 15 అంగుళాల మేర దీన్ని పక్కకు జరుపుకుంటూ తీసుకెళ్లారు. ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత అమెరికాలో చాలా వాణిజ్య సంస్థలను ఇలానే పక్కకు తరలించారు. ఇటీవల మన దేశంలో కూడా ఈ తరహా షిఫ్టింగ్ లు జరుగుతున్నాయి. అసలు ఇలాంటి ప్రయోగం 1930లోనే సక్సెస్ ఫుల్ గా జరిగిందంటే ఆశ్చర్యకరమైన విషయమే.

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×