First Train ATM: ట్రెండ్‌కు అనుగుణంగా మారాలి. లేదంటే వెనక్కి వెళ్లిపోతాము. కేవలం మనుషులకు మాత్రమే కాదు.. వివిధ రంగాలకు ఈ సామెత టెక్ యుగంలో అతికినట్టు సరిపోతుంది. ప్రయాణికుల ఆలోచనలకు అనుగుణంగా అడుగు వేస్తోంది రైల్వేశాఖ. సేవలు అందజేసి రేటును అమాంతంగా పెంచేస్తోంది. అఫ్‌కోర్స్ సేవలు కావాలంటే తప్పదనుకోండి.
దేశంలో తొలిసారి
తాజాగా ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి రైలులో ఏటీఎంని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముంబై నుంచి మన్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలులో ఏటీఎంని ఇన్‌స్టాల్ చేసింది. ఏటీఎంని ఏసీ చైర్ కోచ్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ చేసింది. అంతే తొలిసారి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సదుపాయాన్ని కల్పించింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో కలిసి ఏటీఎంని ఏర్పాటు చేసింది రైల్వేశాఖ. త్వరలో ప్రయాణికులు ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నట్లు సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ప్రయాణికుల్లో ఎవరికైనా మనీ కావాలంటే ఏసీ కోచ్‌లోకి వెళ్లి తీసుకోవాల్సిందే.
ఏసీ కోచ్ దగ్గర
ప్రయాణికులకు డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు అధికారులు. ఏటీఎంని కోచ్ చివరలో ఏర్పాటు చేశామని, ఈ స్థలాన్ని గతంలో ప్యాంట్రీ కోసం వినియోగించేవారు. ఇప్పుడు ఏటీఎం రక్షణ కోసం షట్టర్ డోర్‌ని ఏర్పాటు చేశారు. అసరమైతే మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలిపారు.
ALSO READ: ప్రపంచంలో అతిపెద్ద ఏక శిలా ఫలకంతో చెక్కిన ఆలయం
పంచవటి ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ నుంచి మన్మాడ్ జంక్షన్‌కు వెళ్తుంది. ఒకవైపు ట్రావెల్ చేయడానికి దాదాపు నాలుగున్నర గంటల సమయం పడుతుంది. ఏటీఎం ప్రయోగం సక్సెస్ అయితే మరిన్ని రైళ్లలో ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారుల మాట.
మార్పులు-చేర్పులు తప్పవు
ఈ ఏటీఎం వల్ల ఇబ్బందులు సైతం తప్పవు. స్లీపర్ కోచ్‌లో ఉన్న ప్రయాణికులకు డబ్బుల కావాలంటే ఏసీ కోచ్‌కు వెళ్లాల్సిందే. స్లీపర్ కోచ్ నుంచి ఏసీకి వెళ్లేసరికి ఎంత సమయం పడుతుందో తెలీదు. ఒకవేళ వెళ్లినా అక్కడ ఎంతమంది లైన్‌లో ఉంటారో తెలీదు. ఈలోగా స్టేషన్ నుంచి రైలు కదిలే సమయానికి మళ్లీ ట్రావెలర్ స్లీపర్ కోచ్‌కు రావాల్సి వుంటుందని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ రైలులో ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని మార్పులు చేర్పులు చేయవచ్చని అంటున్న వారు లేకపోలేదు. మొత్తానికి రైలులో ఏటీఎం ఏర్పాటు చేయడంలో ఓ అడుగు వేసిందనే చెప్పవచ్చు.
ATM installed on Panchavati Express: Indian Railways' new experiment begins #BusinessToday #ATMMachine #ATMInTrain #IndianRailways #PanchavatiExpress pic.twitter.com/ZaUQ0pWimr
— Business Today (@business_today) April 16, 2025