OTT Movie : ఇప్పుడు మలయాళం నుంచి వస్తున్న సినిమాలపై ఓకన్నేస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. మంచి కంటెంట్ తో ఎంటర్టైన్ చేస్తున్న ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం, మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమా గురించి చెప్పుకుందాం. ఈ మూవీ మతాలు వేరు కావడంతో, విడిపోయిన ఒక ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ భావన సుదీర్ఘ విరామం తరువాత ఈ సినిమాలో నటించి మెప్పించింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్టీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
మధ్యతరగతి కుటుంబానికి చెందిన జిమ్మీ, నిత్యా అనే అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. అయితే వీళ్ళ మతాలు వేరు కావడంతో టీనేజ్ వయసులోనే వీళ్ళ ప్రేమకు బ్రేక్ పడుతుంది. నిత్య హిందూ అమ్మాయి. జిమ్మీ ఒక ముస్లిం అబ్బాయి. దీని కారణంగానే పెద్దలు వీళ్ళ ప్రేమను అంగీకరించరు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత జిమ్మీ వింటేజ్ కార్లను రిపేర్ చేసి అమ్ముతూ ఉంటాడు. ఎప్పటికైనా పెద్ద డీలర్ గా స్థిరపడాలని కలలు కంటాడు. ఇతనికి పెళ్లి వయసు దాటిపోతుండటంతో, బలవంతంగా ఒక అమ్మాయి తో పెళ్లికి ఒప్పిస్తారు. ఇది ఇలా ఉంటే మరోవైపు నిత్య పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కని ఉంటుంది. అయితే ఆమె భర్త ఒక శాడిస్ట్ కావడంతో, అతనికి విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటోంది.
ఒకరోజు నిత్యా అనుకోకుండా జిమ్మీ ని కలుస్తుంది. ఒక్కసారిగా వీళ్ళు ఎదురు పడటంతో, పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఇక వీళ్ల ప్రేమ మళ్లీ చిగురుస్తుంది. తన భర్త జ్ఞాపకాలను పూర్తిగా తుడిచిపెట్టి, జిమ్మీ ప్రేమ కోసం నిత్యా ఎదురుచూస్తుంది. సమాజంలో వీళ్ల మతాలు వేరు కావడంతో, వ్యక్తిగతంగా కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి వీళ్ళ ప్రేమ ఫలిస్తుందా ? జిమ్మీ కార్ డీలర్ అవుతాడా ? నిత్య మాజీ భర్త వల్ల ఏమైనా ప్రమాదం వస్తుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ మలయాళ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ మలయాళ మూవీ పేరు ‘ఎన్టిక్కక్కక్కోరు ప్రేమోన్దర్న్’ (Ntikkakkakkoru Premondarnn). 2023 లో వచ్చిన ఈ మూవీకి అదిల్ మైమూనత్ అషరఫ్ దర్శకత్వం వహించారు. ఇందులో షరఫుద్దీన్, భావన ప్రధాన పాత్రల్లో నటించారు. బిజిబల్ దీనికి సంగీతం అందించారు. ఈ మూవీ మనోరమా మ్యాక్స్ (ManoramaMAX), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో స్ట్రీమింగ్ అవుతోంది.