E-Paper
Advertisement

Rs 1 Flight Booking: రూపాయికే విమాన ప్రయాణం, ఇండిగో అదిరిపోయే ఆఫర్!

Rs 1 Flight Booking: రూపాయికే విమాన ప్రయాణం, ఇండిగో అదిరిపోయే ఆఫర్!
Advertisement

IndiGo Flight Tickets:

తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ముందుటుంది. ప్రయాణీకులను ఆకట్టుకునేలా సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఇండిగో బంపరాఫర్ ప్రకటించింది. కేవలం రూపాయికే విమాన టికెట్లు అందిస్తుంది. ఇంతకీ ఈ ఆఫర్ కు ఎవరు అర్హులు? ఎప్పటి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందంటే..

చిన్న పిల్లలకే ఈ ప్రత్యేక ఆఫర్..

సాధారణంగా విమాన టికెట్ల ధరల తగ్గింపు అనేది అందరినీ దృష్టిలో పెట్టుకుని అందిస్తారు. కానీ, ఈ ఆఫర్ కేవలం చిన్నపిల్లల తల్లిదండ్రులను బేస్ చేసుకుని అందుబాటులోకి తీసుకొచ్చింది.  ­­­­ ‘ఇన్ఫాంట్ ఫ్లై ఎట్ రూ.1’ పేరుతో స్పెషల్ ఆఫర్ ను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ ద్వారా కేవలం రూపాయికే చిన్నారులకు విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్ అనేది 24 నెలల లోపు వయసు ఉన్న పిల్లలకు వర్తిస్తుంది. ఈ వయసు ఉన్న పిల్లలు కేవలం రూపాయికే విమాన ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ ను పొందాలంటే కేవలం ఇండిగో విమానయాన సంస్థకు చెందిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని వెల్లడించింది.

ఈ ఆఫర్ కోసం చూపించాల్సిన డాక్యుమెంట్స్

Advertisement

రూపాయికే విమాన టికెట్ కొనుగోలు చేసే చిన్న పిల్లల తల్లిదండ్రులు ఎయిర్ పోర్టులో చెకిన్ సమయంలో పిల్లల వయసును చూపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పిల్లల బ్తర్ సర్టిఫికేట్, హాస్పిటల్ డిశ్చార్జ్ కార్డు, టీకా వేయించిన సర్టిఫికేట్, పాస్ పోర్టు లాంటి వాటిలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. పిల్లల వయసు 24 నెలల లోపు ఉందని నిరూపించలేకపోతే, టికెట్ కు సంబంధించి పూర్తి మొత్తాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

Read Also: అయ్యప్ప స్వాములకు ఆర్టీసీ గుడ్ న్యూస్, శబరిమలకు 200 అద్దె బస్సులు!

ఈ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందంటే?

Advertisement

ఇక రూపాయికే టికెట్ ఆఫర్ కేవలం దేశీ విమాన ప్రయాణానికే వర్తిస్తుందని ఇండిగో ప్రకటించింది. ఈ టికెట్ మీద దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతుందని ఇండిగో తెలిపింది. ఇక ఎయిర్ బస్ విమానాల్లో 12 మంది వరకు పసి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. మిగతా విమానాల్లో ఆరురుగు చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులను అనుమతించనున్నట్లు తెలిపారు. విమానంలో ఒక వ్యక్తితో ఒకే శిశువు ఉండాలని సూచించింది. చిన్న పిల్లలతో ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుందని, అందుకే వారికి ఈ ఆఫర్ అందిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలకోసం అధికారిక వెబ్‌ సైట్ ను సందర్శించాలని సూచించింది.

Read Also: రైల్లో పిల్లలకు టికెట్ ఉచితమేనా.. కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×