PBKS VS KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల ( Lucknow Super Giants vs Punjab Kings) మధ్య ఇవాళ సూపర్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ఏకంగా 8 వికెట్ల తేడాతో లక్నో జట్టుపై పంజాబ్ ( Punjab Kings) విజయం సాధించింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ జట్టు… ఈ టోర్నమెంట్ లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. లక్నో సూపర్ జెంట్స్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని… 16.2 ఓవర్లలోనే… ఫినిష్ చేసింది పంజాబ్ కింగ్స్. ఈ తరుణంలోనే ఈ టోర్నమెంట్లో రెండో విజయాన్ని నమోదు చేయడమే కాకుండా… పాయింట్స్ టేబుల్ లో కూడా రెండవ స్థానానికి ఎగబాకింది పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అలాగే ప్రభు సిమ్రాన్ సింగ్ ఇద్దరు అద్భుతంగా ఆడారు. చివర్లో భారీ సిక్సర్ తో… పంజాబ్ జట్టుకు రెండో విజయాన్ని అందించాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.
Also Read: Kohli On World Cup 2027: 2027 వరల్డ్ కప్ లో ఆడటంపై కోహ్లీ సంచలన ప్రకటన..రిటైర్మెంట్ అప్పుడే ?
ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ భయంకర బ్యాటింగ్
లక్నో జట్టు పైన పంజాబ్ బ్యాటర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, అలాగే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు భయంకరమైన బ్యాటింగ్ తో విరుచుకుపడ్డారు. గల్లీలో క్రికెట్ ఆడినట్టు… సిక్స్ లు ఫోర్లు దంచి కొట్టారు. ముఖ్యంగా ప్రభు సిమ్రాన్ సింగ్.. 34 బంతుల్లో 69 పరుగులు చేశారు. ఇందులో మూడు సిక్సర్లు అలాగే తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. 202 స్ట్రైక్ రేటుతో విరుచుకుపడ్డాడు ప్రభు సిమ్రాన్ సింగ్. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్సు అయ్యారు కూడా… తన వంతు పాత్ర పోషించాడు. 30 వంతుల్లోనే 52 పరుగులు చేసి రఫ్ ఆడించాడు.
మొన్నటి మ్యాచ్లో సెంచరీ మిస్ చేసుకున్న శ్రేయస్ అయ్యర్… ఇవాళ మాత్రం సిక్సర్ తో ఆఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. ఇవాల్టి మ్యాచ్లో నాలుగు సిక్సర్లు బాదిన శ్రేయస్ అయ్యర్ మూడు బౌండరీలు కొట్టాడు. 173 స్ట్రైక్ రేట్ తో.. శభాష్ అనిపించాడు అయితే ప్రభు సిమ్రాన్ సింగ్.. 69 పరుగుల వద్ద అవుట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన వదెరా.. కూడా 25 బంతుల్లో 43 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇతను కూడా మూడు బౌండరీలతో పాటు నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఈ దెబ్బకు 16.2 ఓవర్లకే కేవలం రెండు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ లక్ష్యాన్ని చేదించింది. అటు అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది.
పాయింట్స్ టేబుల్ లో దుమ్ము లేపిన పంజాబ్ కింగ్స్
వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్… నాలుగు పాయింట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంది. అయితే +2.266 రన్ రేట్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. +1.485 రన్ రేట్ తో పంజాబ్ కింగ్స్ రెండో స్థానాన్ని దక్కించుకుంది.