E-Paper
Advertisement

బౌద్ధ ఆలయాల దర్శనం, ఏకంగా 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన IRCTC!

బౌద్ధ ఆలయాల దర్శనం, ఏకంగా 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన IRCTC!

IRCTC Launches Discounted Buddhist Circuit Train: ప్రముఖ పర్యాటక సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికులకు మరో క్రేజీ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బౌద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే వారికి చక్కటి అవకాశం కల్పిస్తోంది.  IRCTC స్పెషల్  బౌద్ధ టూరిస్ట్ రైలు ప్యాకేజీపై ఏకంగా 20% తగ్గింపు ప్రకటించింది. ఈ ఆఫర్ తో తక్కువ ధరలో బౌద్ధ క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది.

7 రాత్రులు, 8 రోజుల యాత్ర

ఇక ఈ ప్రత్యేక టూర్ మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యాత్ర ప్రారంభం సఫ్దర్‌ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ట్రిప్‌ లో గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన ముఖ్యమైన పవిత్ర ప్రాంతాలను  సందర్శించేలా ప్లాన్ చేశారు. మొదటగా బోధ్ గయా వెళ్తారు. బుద్ధుడు బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందిన ప్రదేశం కావడంతో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.

ఆ తర్వాత నలందా, రాజ్ గిర్ ప్రాంతాలను సందర్శిస్తారు. నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాత విద్యాకేంద్రంగా నిలిచింది. ఆ తర్వాత ఈ యాత్ర వారణాసికి వెళ్తుంది. అక్కడ సారనాథ్ కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే బుద్ధుడు తన మొదటి ఉపదేశం ఇచ్చారు. అనంతరం  బుద్ధుని జన్మస్థలం లుంబిని, మహాపరినిర్వాణ స్థలం కుషినగర్, శ్రావస్తి లాంటి ప్రదేశాలను కూడా సందర్శిస్తారు. ఈ అన్ని ప్రదేశాలు బౌద్ధమతానికి ఎంతో కీలకమైన క్షేత్రాలుగా గుర్తింపు పొందాయి. ఈ యాత్రలో భాగంగా చివరలో తాజ్ మహల్ సందర్శనను కూడా చేర్చారు.

డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో యాత్ర

ప్రయాణం పూర్తిగా డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులోనే జరుగుతుంది. ఈ రైలు ఆధునిక సౌకర్యాలతో కూడి ఉంటుంది. ఇందులో 12 LHB కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులు తమ అవసరాలకు అనుగుణంగా AC ఫస్ట్ క్లాస్, AC టూ టైర్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. AC 1లో విశాలమైన క్యాబిన్లు, కూపేలు, వ్యక్తిగత లాకర్లు లాంటి సౌకర్యాలు ఉంటాయి.

ఒకేసారి 60 మంది భోజనం చేసే అవకాశం

రైలులో భోజనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. రెండు డైనింగ్ కార్లు ఉండి, ఒక్కో కారులో 60కి పైగా ప్రయాణికులు ఒకేసారి కూర్చొని భోజనం చేయవచ్చు.దేశీ, విదేశీ వంటకాలు కూడా అందిస్తారు. ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంది.

20 శాతం డిస్కౌంట్

ఈ పర్యటనను అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో IRCTC  డిస్కౌంట్‌ను ప్రకటించింది. ట్విన్ షేరింగ్ పద్ధతిలో ఒక్కో వ్యక్తికి ప్రారంభ ధరను సుమారు రూ. 76,905కు తగ్గించారు. పెద్ద స్థాయిలో సౌకర్యాలు, పర్యటన ప్రదేశాలు, భోజనం, వసతి అన్నీ కలిపి చూస్తే చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీగా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికత ప్రయాణాన్ని కోరుకునే వారికి ఈ బౌద్ధ టూర్ ఓ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: మిస్సైన 37 ఏళ్లకు తిరిగొచ్చిన విమానం, ఇప్పటికీ అంతు చిక్కని పాన్ ఆమ్ 914 ఫ్లైట్ మిస్టరీ!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×