E-Paper
Advertisement

డైరెక్టర్ అనిల్ రావిపూడికి, జబర్దస్త్ అభికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

డైరెక్టర్ అనిల్ రావిపూడికి, జబర్దస్త్ అభికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?
Advertisement

Director AnilRavipudi : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు.. ఈయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సీనియర్ హీరోలతో ఈయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్స్ సునామీ సృష్టించాయి. ఈ ఏడాది చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మరో బిగ్గెస్ట్ హెడ్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు.. సినిమాల సంగతి పక్కన పెడితే.. డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అదిరే అభి కి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఉన్న రిలేషన్ గురించి ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.. వీరిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

అనిల్ రావిపూడి, అభి మధ్య రిలేషన్..?

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. స్టార్ హీరోలు అందరితోనూ ఈయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే అనిల్ రావిపూడి గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. అయితే ఈయన డైలాగ్ గా తన కెరీర్ ని ప్రారంభించి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నవదీప్ హీరోగా నటించిన గౌతమ్ ఎస్ఎస్సి మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ టైంలో ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన జబర్దస్త్ అదిరే అభి తో మంచి సాన్నిత్యం ఏర్పడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బయటపెట్టారు.. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయినట్లు డైరెక్టర్ చెప్పారు. ఇద్దరు కలిసి కూర్చుని డైలాగులు రాయడం అలా వాళ్ళిద్దరి మధ్య తెలియకుండానే మంచి బంధం ఏర్పడిందని అనిల్ రావిపూడి అన్నారు. డైలాగులు తెలంగాణ యాసలో రాయడానికి అభి చాలా హెల్ప్ చేశాడు అంటూ తన ఫ్రెండ్ గురించి చాలా గొప్పగా చెప్పారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మాంత్రికురాలు దెబ్బకు షాక్.. విల్లాలో దెయ్యాలు.. ఓ ఆట ఆడుకున్న బాలు..

అనిల్ రావిపూడి సినిమాలు..

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాలపై ఆసక్తి ఉండడంతో కుటుంబ సభ్యులను ఒప్పించి ఇటుగా అడుగులు వేశారు. అనిల్ రావిపూడి బాబాయి అరుణ ప్రసాద్ ఒక సినిమా డైరెక్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు. 2005 లో విడుదలైన నవదీప్ గౌతమ్ ఎస్ఎస్సి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తర్వాత ఎన్నో సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో డైరెక్టర్గా వరుసగా సినిమాలు చేస్తూ సత్తాని చాటుతున్నాడు. సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలు అతనికి మంచి సక్సెస్ ని అందించాయి. ఇక వెంకటేష్ తో చేసిన ఎఫ్2 మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. రీసెంట్ గా వచ్చిన మన శంకర్ ప్రసాద్ గారు వరకు ఆయన చేసిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులను తెరకెక్కించే పనిలో ఉన్నారు అనిల్ రావిపూడి. కేవలం సినిమాలకు దర్శకత్వం వహించడం మాత్రమే కాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×