E-Paper
Advertisement

టాయ్ ట్రైన్‌కు హైడ్రోజన్ ఇంజిన్.. 120 ఏళ్ల రైల్వేకు కొత్త టెక్నాలజీ!

టాయ్ ట్రైన్‌కు హైడ్రోజన్ ఇంజిన్.. 120 ఏళ్ల రైల్వేకు కొత్త టెక్నాలజీ!
Advertisement

Hydrogen Powered Kalka-Shimla Toy Train: దేశంలోని ప్రముఖ పర్యాటక రైల్వే మార్గాల్లో ఒకటైన కల్కా–సిమ్లా రైల్వే లైన్‌లో త్వరలో సరికొత్త మార్పులు రాబోతున్నాయి. పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఈ మార్గంలో హైడ్రోజన్‌ తో నడిచే టాయ్ ట్రైన్‌ను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే దేశంలోని వారసత్వ రైల్వే మార్గాల్లో పర్యావరణహిత రవాణాకు కొత్త అధ్యాయం మొదలైనట్లే.

‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’లో భాగంగా..

కాలుష్యాన్ని తగ్గించి, క్లీన్ ట్రాన్స్ పోర్టును ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన చారిత్రక రైల్వే మార్గాల్లో హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 35 హైడ్రోజన్ రైళ్లను నడిపేందుకు కేంద్రం ప్రణాళికలను ప్రకటించింది. వీటిలో కల్కా–సిమ్లా రైల్వే మార్గం కూడా ఉంది. సాధారణ డీజిల్ రైళ్ల మాదిరిగా కాకుండా, హైడ్రోజన్ రైళ్లు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో  కాలుష్యం లేని నీరు వెలువడుతుంది. దీంతో కాలుష్య కారకాలు భారీగా తగ్గుతాయి.

బరోగ్ స్టేషన్‌ లో హైడ్రోజన్ ప్లాంట్

Advertisement

ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే శాఖ ఇప్పటికే కీలక అడుగులు వేసింది. కల్కా–సిమ్లా మార్గంలో అవసరమైన సర్వేను పూర్తి చేసింది. హైడ్రోజన్ ఇంధనాన్ని అందించేందుకు బరోగ్ రైల్వే స్టేషన్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని కూడా గుర్తించింది. అయితే, కల్కా–సిమ్లా రైల్వే మార్గం సాధారణ రైల్వే లైన్లకు భిన్నంగా ఉంటుంది. నిటారుగా ఉండే కొండ మార్గాలు, ఎత్తుపల్లాలు, ఇరుకైన రైల్వే ట్రాక్‌ ల కారణంగా హైడ్రోజన్ టెక్నాలజీని ఇక్కడ అమర్చడం అంత ఈజీ కాదు. అందుకే స్పెషల్ ఇంజినీరింగ్ పరిష్కారాలు అవసరమని అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక, పరిపాలనా ప్రక్రియలు పూర్తయిన తర్వాత ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే, తుది ఆమోదం, సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ప్రాజెక్టు అమలు ఆధారపడి ఉంటుంది.

120 ఏళ్ల చరిత్రకు కొత్త సాంకేతికత

1898 నుంచి 1903 మధ్య బ్రిటిష్ పాలనలో నిర్మించిన కల్కా–సిమ్లా రైల్వే లైన్ మొత్తం 96 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. శివాలిక్ కొండల మీదుగా సాగే ఈ మార్గంలో 103 సొరంగాలు, 900కు పైగా వంతెనలు ఉన్నాయి. 2008 జూలైలో యునెస్కో ఈ రైల్వే మార్గాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇప్పుడు ఈ చారిత్రక మార్గంలో హైడ్రోజన్ టాయ్ ట్రైన్ అందుబాటులోకి వస్తే, పర్యాటకులకు కొత్త అనుభూతితో పాటు పర్యావరణహిత ప్రయాణ సౌకర్యం కూడా లభించే అవకాశం ఉంది.

Advertisement

Read Also: చెక్ ఇన్ ఆలస్యంతో విమానం మిస్.. ఎయిర్‌లైన్‌కు భారీ జరిమానా!

Tags

Related News

చెక్ ఇన్ ఆలస్యంతో విమానం మిస్.. ఎయిర్‌లైన్‌కు భారీ జరిమానా!

బెంగళూరు-గోవా వందే భారత్ వెరీ స్లో.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

PNR అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దానిలోని అంకెలు దేనికి సంకేతం?

రైలులో విమానం రూల్.. ఈ తప్పు అస్సలు చేయెుద్దు.. లేదంటే టికెట్ ఉన్నా 6 రెట్లు ఫైన్ కట్టాల్సిందే!

ఆర్టీసీ సంచలన నిర్ణయం.. తలుపులు మూశాకే బస్సు స్టార్ట్.. ప్రవళిక ఘటనతో మేల్కొలుపు!

రైల్లో మీ వస్తువులు లేదా లగేజీ మర్చిపోతే ఏం చేయాలి? తిరిగి పొందడానికి వెంటనే ఇలా చేయండి

రైలు టికెట్ రంధ్రాల వెనుక ఇంత కథ ఉందా? చాలామందికి తెలియని ఆసక్తికర నిజం!

Big Stories

Advertisement
×