E-Paper
Advertisement

చదువు, మేధస్సులో ప్రపంచానికే బాస్‌లు.. టాప్-5 తెలివైన దేశాలు.. భారత్ స్థానం ఎక్కడంటే?

చదువు, మేధస్సులో ప్రపంచానికే బాస్‌లు.. టాప్-5 తెలివైన దేశాలు.. భారత్ స్థానం ఎక్కడంటే?
Advertisement

Educated Countries: ప్రపంచంలో విద్యకు సాటి ఏది లేదని చాలా మంది అభిప్రాయం. విద్య ఉంటే పేదవాడు సైతం అంచంచలమైన స్థాయికి ఎదిగిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రపంచంలో అత్యధిక విద్యావంతులు ఉన్న దేశాల జాబితాను ఇటీవల ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) విడుదల చేసింది. నాణ్యమైన విద్యా వ్యవస్థ, ప్రభుత్వ ప్రోత్సాహం, ఉన్నత చదువులకు ఉన్న ప్రాధాన్యత ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చింది. దాని ప్రకారం టాప్-5 దేశాలేంటో ఇప్పుడు చూద్దాం.

కెనడా

ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతులు ఉన్న దేశంగా కెనడా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ సుమారు 63 శాతం మంది పెద్దలు కాలేజీ డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత చదువులు పూర్తి చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కమ్యూనిటీ కాలేజీల బలమైన వ్యవస్థతో పాటు విద్యార్థులకు లభించే ఆర్థిక సహాయం, రుణాలు ఇక్కడ ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చాయి.

ఐర్లాండ్

Advertisement

ఐర్లాండ్‌లో దాదాపు 58 శాతం మంది యువత, పెద్దలు ఉన్నత విద్యను అభ్యసించారు. విద్యా వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ మార్కెట్ అవసరాలకు తగినట్లుగా కోర్సులను తీర్చిదిద్దడమే దీనికి కారణం. ఈ విద్యా పునాది వల్లనే ఐర్లాండ్ నేడు గ్లోబల్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సేవల రంగాల్లో దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తోంది.

జపాన్

జపాన్‌లో దాదాపు 57 శాతం మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ఈ దేశం మొదటి నుంచీ సైన్స్, మ్యాథ్స్, ఇంజినీరింగ్ విద్యకు పెద్దపీట వేస్తోంది. ఇక్కడి కఠినమైన క్రమశిక్షణ, అంకితభావంతో కూడిన విద్యా సంస్కృతి వల్ల ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగాల్లో జపాన్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది.

దక్షిణ కొరియా

Advertisement

దక్షిణ కొరియాలో 56 శాతం మంది ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఇక్కడ యువతలో చదువు పట్ల తీవ్రమైన పోటీ వాతావరణం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇక్కడి విద్యార్థులు చూపించే ప్రతిభ వల్లనే ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఆటోమొబైల్ పరిశ్రమల్లో కొరియా ప్రపంచంలోనే కీలక శక్తిగా ఎదిగింది.

యునైటెడ్ కింగ్‌డమ్ (UK)

బ్రిటన్‌లో సుమారు 54 శాతం మంది పెద్దలు ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురాతన విశ్వవిద్యాలయాలకు యుకే నిలయం. విదేశీ విద్యార్థులను విశేషంగా ఆకర్షించే ఈ దేశం.. ఫైనాన్స్, సైన్స్, క్రియేటివ్ రంగాలు మరియు పరిశోధనల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను కలిగి ఉంది.

Also Read: పండుగ వేళ కొత్త మోసాలు.. కొంపముంచుతున్న ‘ఫ్రీ’ ఆఫర్లు.. NPCI కీలక హెచ్చరికలు!

భారత్ పరిస్థితి ఏంటంటే?

OECD విడుదల చేసిన జాబితాలో భారత్ కనీసం టాప్ -20లో కూడా చోటు దక్కించులేకపోయింది. భారత్‌లో ఉన్నత విద్య (డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ) కలిగిన పెద్దల (25-64 ఏళ్ల వయస్సు వారు) శాతం సుమారు 20% నుండి 22% ఉండటమే దీనికి కారణం. భారత్ లో ఉన్నత విద్యా వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ భారీ జనాభా కారణంగా ర్యాంకింగ్స్ లో వెనుకబడి ఉందని చెప్పవచ్చు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడం, కాలేజీల్లో చేరేవారి కంటే పాఠశాల స్థాయిలోనే చదువు ఆపేసేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం, ఉన్నత విద్యకు అవుతున్న ఆర్థిక భారం.. ఈ జాబితాలో భారత్ వెనుకబడేలా చేసింది.

Also Read: Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. రూ.219కే 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్.. వివరాలు ఇవే!

Tags

Related News

లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్.. వామ్మో.. అన్ని మీటర్ల పైనా..

టాయ్ ట్రైన్‌కు హైడ్రోజన్ ఇంజిన్.. 120 ఏళ్ల రైల్వేకు కొత్త టెక్నాలజీ!

చెక్ ఇన్ ఆలస్యంతో విమానం మిస్.. ఎయిర్‌లైన్‌కు భారీ జరిమానా!

బెంగళూరు-గోవా వందే భారత్ వెరీ స్లో.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

PNR అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దానిలోని అంకెలు దేనికి సంకేతం?

రైలులో విమానం రూల్.. ఈ తప్పు అస్సలు చేయెుద్దు.. లేదంటే టికెట్ ఉన్నా 6 రెట్లు ఫైన్ కట్టాల్సిందే!

ఆర్టీసీ సంచలన నిర్ణయం.. తలుపులు మూశాకే బస్సు స్టార్ట్.. ప్రవళిక ఘటనతో మేల్కొలుపు!

Big Stories

Advertisement
×