BigTV English

Suv On Railway Track: కారును రైల్వే ట్రాక్ ఎక్కించిన మందుబాబు, ఇంతలో అదే ట్రాక్ పైకి రైలు, ఆ తర్వాత..

Suv On Railway Track: కారును రైల్వే ట్రాక్ ఎక్కించిన మందుబాబు, ఇంతలో అదే ట్రాక్ పైకి రైలు, ఆ తర్వాత..

మందు తాగి వాహనాలు నడపకూడదని పోలీసులు నిత్యం మొత్తుకుంటూనే ఉన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే మీ ప్రాణాలకే కాదు, ఎదుటి వారి ప్రమాణాలకు ప్రమాదం తప్పదంటున్నారు. అయినా, మందు బాబులు పట్టించుకున్న పాపానపోవట్లేదు. ఫూటుగా తాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతూనే ఉన్నారు. తాజాగా ఓ యువకుడు పీలకదాకా తాగి కారును ఏకంగా రైల్వే ట్రాక్ మీదికి ఎక్కించాడు. లోకో పైలెట్ సడెన్ బ్రేక్ వేయడంతో పెను ముప్పు తప్పింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన కొంత మంది యువకులు మహీంద్రా థార్ కారును రెంట్ కు తీసుకున్నారు. పిక్ నిక్ కు వెళ్లి ఫుల్ గా మద్యం తాగారు. వారిలో ఓ యువకుడు కారును నడుపుతూ మద్యం మత్తులో రైల్వే ట్రాక్ మీదికి ఎక్కించాడు. కారు టైర్లు రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయాయి. ముందుకు, వెనక్కి కదలేకపోయింది. అదే సమయంలో గూడ్స్ రైలు వచ్చింది. వెంటనే కారులోని వాళ్లంతా కిందికి దిగి పారిపోయారు. లోకో పైలట్ ముందున్న కారును చూసి సడెన్ బ్రేకులు వేశాడు. వెంటనే రైలును ఆపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.


రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చిన లోకో పైలెట్

గూడ్స్ రైలు లోకో పైలెట్ ట్రాక్ మీద కారు ఉన్న విషయాన్ని రైల్వే పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. ఆ కారును నడిపిన యువకుడికి అప్పటిక మద్యం మత్తు దిగలేదు. ఒక్కసారిగా కారును ఫుల్ రేస్ చేసి ట్రాక్ కిందికి కారును పరుగులు తీయించాడు. అక్కడి నుంచి కారును వేగంగా నడుపుకుంటూ పారిపోయాడు. ఎదురుగా వచ్చిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులను కూడా ఢీకొడుతూ వెళ్లిపోయాడు. పోలీసులు కూడా ఆ కారును ఫాలో అవుతూ వెళ్లారు. నాలుగు కిలో మీటర్ల దూరం తర్వాత కారును ఓవర్ టేక్ చేశారు. కారు నడిపే వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. మహీంద్రా థార్ ఎస్‌యూవీ కారును అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కారు యజమానిని విచారించి మిగతా నిందితుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో గూడ్స్ రైలు సుమారు 15 నిమిషాల పాటు ఆగాల్సి వచ్చింది. ఈ ఘటనతో ప్యాసెంజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు ఈ ఘటనపై రైల్వే పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రోడ్డు మీద వెళ్లే వారిని ఢీకొట్టినందుకు స్థానిక పోలీసులు, రైలు సేవలకు అంతరాయం కలిగించినందుకు రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.

Read Also:భారత్ లో చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఇదే! కానీ, ఇక్కడ రైలు ఆగదు ఎందుకో తెలుసా?

Related News

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Big Stories

×