SCR Satavahana Express: ఉభయ తెలుగు రాష్ట్ర ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ- సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు ఇకపై సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శాతవాహన్ ఎక్స్ ప్రెస్(Satavahana Express) రైలు (12713/12714)కు అత్యాధునిక కోచ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్(Intercity Express) గా పిలిచే ఈ రైల్లో ఇకపై ప్రయాణీకులు మరింత భద్రంగా, సౌకర్యంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది.
ICF కోచ్ ల స్థానంలోLHB కోచ్ ల ఏర్పాటు
ఉభయ రాష్ట్రాల నడుమ సేవలను అందిస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ కు ప్రస్తుతం ICF కోచ్ లు ఉన్నాయి. ఇకపై వాటి స్థానంలో లేటెస్ట్ లింకే హాఫ్ మన్ బుష్ (LHB) కోచ్ లను ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న కోచ్ లతో పోల్చితే ఈ కోచ్ లు చాలా లగ్జరీ ప్రయాణాన్ని అందించనున్నాయి. ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కలిగించనున్నాయి.
Journey on Satavahana Exp gets more comfortable! 📢
Tr No.12713/12714 Vijayawada-Sec'bad Satavahana Exp converted from Conventional to Modern LHB (Linke-Hofmann-Busch) coaches w.e.f 10.02.25.
👉Enhancing Rail travel experience, providing safer & comfortable journey
— South Central Railway (@SCRailwayIndia) February 10, 2025
LHB కోచ్ ల ప్రత్యేకతలు ఇవే!
లేటెస్ట్ LHB కోచ్ లు ప్రయాణీకులకు విసుగు కలిగించని ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. అద్భుమైన కుషనింగ్, ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థ, విశాలమైన విండోలు ఉంటాయి. ఈ అత్యాధుని కోచ్ లు లేటెస్ట్ ఇంటీరియర్స్, మెరుగైన వెంటిలేషన్, నాయిస్ తగ్గింపు ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇవి ప్రీమియం జర్నీ ఎక్స్ ప్రీరియన్స్ ను అందిస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. LHB కోచ్ లు యాంటీ క్లైంబింగ్ టెక్నాలజీతో పాటు మెరుగైన క్రాష్ వర్తీ నెస్ తో సహా అధునాతన భద్రతా ఫీచర్లతో రూపొందించినట్లు తెలిపారు. ఈ కోచ్ లు పట్టాలు తప్పే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ప్రయాణీకులకు మరింత భద్రత కలిగిస్తాయి. ఇక ఈ రైలులోని హాట్ బఫే కారు పూర్తిగా ఎయిర్ కండీషన్ తో అందుబాటులోకి రానుంది. అంతేకాదు, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్, సప్రెషన్ సిస్టమ్ ను కలిగి ఉంటాయి. LHB కోచ్ లతో రైలు అత్యంత వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవం
LHB కోచ్‌ల అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో శాతవాహన ఎక్స్ ప్రెస్ లో వెళ్లే ప్రయాణీకులు సురక్షితమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని పొందే అవకాశం ఉందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణా అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలను, రోలింగ్ స్టాక్ ను ఎప్పటికప్పు ఆధునికీకరించడంలో ముందు ఉంటుందన్నారు. అందుకు ఉదాహారణ శాతవాహన ఎక్స్ ప్రెస్ కు LHB కోచ్ లను ఏర్పాటు చయడం అన్నారు.
Read Also: గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాలకూ ఓ వందేభారత్ స్లీపర్.. ఏ రూట్‌లో నడుస్తుందంటే?