BigTV English

India’s Highest Earing Railway station: దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఏ స్థానంలో ఉందంటే?

India’s Highest Earing Railway station: దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఏ స్థానంలో ఉందంటే?

Indian Railway Stations: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన సంస్థల్లో భారతీయ రైల్వే సంస్థ ఒకటిగా కొనసాగుతున్నది. అమెరికా, చైనా, రష్యా తర్వాత స్థానంలో ఇండియన్ రైల్వే ఉంది. సుమారు లక్ష కిలో మీటర్ల రైల్వే లైన్లు, 22 వేలకు పైగా రైళ్లు, 7,308 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. భారతీయ రైల్వే సంస్థకు టికెట్ల అమ్మకంతో పాటు సరుకు రవాణా ద్వారా భారీగా ఆదాయం లభిస్తున్నది. అందేకాదు, రైల్వే స్టేషన్ల ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఇన్ కం పొందుతున్నది. రైల్వే స్టేషన్లలోని షాపులు, యాడ్స్, ఫ్లాట్ ఫారమ్ టికెట్స్, క్లాక్ రూమ్ లు, వెయిటింగ్ హాళ్ల ద్వారా ఆదాయం పొందున్నది రైల్వే సంస్థ. అయితే, దేశంలోని ఏ రైల్వే స్టేషన్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿ తొలి స్థానంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్- రూ. 3,337 కోట్లు

దేశంలో అత్యధిక ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్లలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొలి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంసవత్సరంలో ఈ రైల్వే స్టేషన్ అత్యధికంగా ఇన్ కమ్ సాధించింది. ఏకంగా ఈ రైల్వే స్టేషన్ రూ. 3,337 కోట్లు సంపాదించినట్లు రైల్వేశాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  ఆదాయంలోనే కాదు, అధిక రద్దీ ఉన్న స్టేషన్లలోనూ టాప్ ప్లేస్ లో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి నుంచి 39,362,272 మంది రాకపోకలు కొనసాగించారు.


⦿ రెండో స్థానంలో హౌరా రైల్వే స్టేషన్- రూ. 1,692 కోట్లు

అత్యధిక ఆదాయం పొందే రైల్వే స్టేషన్లలో బెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్ రెండో స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏకంగా రూ. 1,692 కోట్లు ఆదాయాన్ని సంపాదించింది. అంతేకాదు, అత్యధిక రద్దీ ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2023-24లో ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏకంగా 61,329,319 మంది ప్రయాణీకుల రాకపోకలు కొనసాగించారు.

⦿ మూడో స్థానంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్- రూ. 1,299 కోట్లు

ఆదాయం పరంగా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఈ రైల్వే స్టేషన్ ఏడాది కాలంఓ రూ. 1,299 కోట్లు సంపాదించింది. అంతేకాదు, ఇక్కడి నుంచి 30,599,837 మంది రాకపోకలు సాగించారు.

⦿ నాలుగో స్థానంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్- రూ. 1,276 కోట్లు  

ఇక తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆదాయంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2023-24లో ఈ రైల్వే స్టేషన్ ద్వారా రైల్వే సంస్థకు ఏకంగా రూ. 1,276 ఆదాయం లభించింది.  అదే సమయంలో ఇక్కడి నుంచి 27,776,937 కోట్ లమంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించారు.

⦿ ఐదో స్థానంలో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్- రూ. 1,227 కోట్లు

ఆదాయం పరంగా ఐదో స్థానంలో నిలిచింది ఢిల్లీలోని హర్జత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1227 కోట్లు సంపాదించింది. ఇక్కడి నుంచి 14,537,687 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు.

Read Also: బుల్లెట్ రైళ్లు, హైస్పీడ్ ట్రైన్లు.. బడ్జెట్ లో రైల్వేకు భారీగా కేటాయింపులు!

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×