Sri Reddy on Ravi Chandra Reddy: మాజీ సీఎం జగన్ విదేశాల్లో ఉంటే, ఏపీలో మాత్రం వైసీపీ నేతలు పార్టీ మార్పుపై దృష్టి సారించారని చెప్పవచ్చు. తాజాగా వైసీపీకి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి పార్టీ పదవికి శనివారం టాటా చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రవిచంద్ర రెడ్డి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. పార్టీపరమైన అంశాలలో కీలక పాత్ర పోషించిన రవిచంద్ర రెడ్డి రాజీనామా చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఈయన బీజేపీలో చేరగా, రాష్ట్ర అద్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు.
ఏపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నుండి ప్రారంభమైన పార్టీ రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీకి చెందిన బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, దొరబాబు, పోతుల సునీత, ఉదయభాను, కిలారి వెంకట రోశయ్య, అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్, ఇలా ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేయడంతో పార్టీ అధినాయకత్వం ఆలోచనలో పడినట్లు సమాచారం.
అయితే పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి రాజీనామా చేయడంపై శ్రీ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీకి విచిత్ర సలహా ఇవ్వడం విశేషం. పార్టీకి తాను దూరమంటూ ఇటీవల ప్రకటించిన శ్రీ రెడ్డి తాజాగా పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రవిచంద్ర రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంపై శ్రీ రెడ్డి మాట్లాడుతూ తమకు వైసీపీలో ఏ గుర్తింపు లేకుండా వెనక నుండి ఉడత సాయంగా పనిచేస్తున్నామని, వైసీపీ నాయకులు యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు కానీ పార్టీకి రాజీనామా చేయకండని శ్రీరెడ్డి సూచించారు. ఈమేరకు శ్రీ రెడ్డి వీడియోను విడుదల చేశారు.
Also Read: Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి రోజుకు వేలల్లో కాల్స్.. లిఫ్ట్ చేస్తే అంతే సంగతులట
వైసీపీ అధినేత జగన్ విదేశాల్లో ఉన్న క్రమంలో రవిచంద్రా రెడ్డి రాజీనామా చేయడంపై పార్టీ క్యాడర్ షాక్ కు గురయ్యారట. అసలే జనవరి నెలాఖరులో జిల్లాల పర్యటనకు జగన్ సిద్దమవుతున్న క్రమంలో రాజీనామాలు కొత్త తలనొప్పులు తెస్తున్నాయని కార్యకర్తలు తెలుపుతున్నారు. అయితే పార్టీ నాయకుల రాజీనామాపై గతంలో జగన్ స్పందిస్తూ.. పార్టీని వెన్నంటి ఉన్న వారికి న్యాయం చేస్తామని, నాయకులు మారినంత మాత్రాన కార్యకర్తలు మారరంటూ చెప్పిన మాటను కార్యకర్తలు గుర్తుకు చేసుకుంటున్నారు.