Highway Toll free Number 1033: చాలా మంది నేషనల్ హైవే మీద ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణ సమయంలో తరచుగా రోడ్డు మీద 1033 అనే హెల్ప్ లైన్ నెంబర్ కనిపిస్తుంటుంది. చాలా మంది ఈ నెంబర్ ను పట్టించుకోరు. మరికొంత మంది ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో సమాచారం ఇచ్చేందుకు ఉపయోగపడుతుందేమో అనుకుంటారు. కానీ, ఈ నెంబర్ వల్ల చాలా లాభాలున్నాయి.
1033 హెల్ప్ లైన్ నెంబర్ ప్రత్యేకత ఏంటి?
1033 అనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్. జాతీయ రహదారి మీద ప్రయాణం చేసే సమయంలో ఏదైనా ఆపద వస్తే, ఆ నెంబర్ కు కాల్ చేయాలి. వెంటనే నేషల్ హైవే సిబ్బంది మీ సమస్య పరిష్కరిస్తారు. ముఖ్యంగా ఈ నెంబర్ ద్వారా నాలుగు ఉచిత సౌకర్యాలను పొందే అవకాశం ఉంటుంది.
⦿ కారులో జాతీయ రహదారి మీద వెళ్తున్న సమయంలో పెట్రోల్ అయిపోతే.. 1033 నెంబర్ కు కాల్ చేయాలి. మీ సమస్య చెప్పడంతో పాటు మీరు ఎక్కడ ఉన్నారో లొకేషన్ చెప్పాలి. వెంటనే దగ్గరలోని టోల్ ప్లాజా నుంచి 5 లీటర్ల పెట్రోల్ ను తీసుకొచ్చి ఫిల్ చేస్తారు. మీరు కేవలం 5 లీటర్ల పెట్రోల్ కు డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఎటువంటి సర్వీస్ ఛార్జ్ ఉండదు. ఒకవేళ మీకు నచ్చితే వచ్చిన సిబ్బందికి గుడ్ వీల్ ఇవ్వొచ్చు.
⦿ ఒకవేళ కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో పంచర్ అయ్యింది. స్పేర్ టైర్ ఉన్నప్పటికీ ఎలా మార్చాలో తెలియదు. అప్పుడు కూడా 1033కి కాల్ చేసి లొకేషన్ చెప్తే హైవే సిబ్బంది వచ్చి టైర్ మార్చుతారు.
Read Also: టికెట్లపై 75 శాతం డిస్కౌంట్.. విద్యార్థులకు రైల్వే సంస్థ స్పెషల్ రాయితీల గురించి తెలుసా?
⦿ ఒకవేళ మీరు ప్రయాణిస్తున్న కారు బ్రేక్ డౌన్ అయితే, నేషనల్ హైవే సిబ్బంది మెకానిక్ ను తీసుకొచ్చి రిపేర్ చేయిస్తారు. ఒకవేళ రిపేర్ కాకపోతే, మీ కారును హైవే సిబ్బంది టోయింగ్ చేస్తూ గ్యారేజీకి తీసుకెళ్తారు.
⦿ ఒకవేళ జాతీయ రహదారి మీద ప్రయాణం చేసే సమయంలో యాక్సిడెంట్ అయి, దెబ్బలు తగిలితే వెంటనే 1033 నెంబర్ కు కాల్ చేయాలి. 10 నిమిషాల్లో అంబులెన్స్ యాక్సిడెంట్ స్పాట్ కు వచ్చి, మిమ్మల్ని హాస్పిటల్ కు తీసుకెళ్తుంది. అటు డ్యామేజ్ అయిన కారును నేషనల్ హైవే సిబ్బంది టోల్ ప్లాజా దగ్గర పెడతారు.
ఈ నాలుగు సర్వీసులు 1033కి కాల్ చేసి పొందే అవకాశం ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ 24/7 అన్ని భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరూ నేషనల్ హైవే మీద ప్రయాణించే సమయంలో ఏదైనా ఆపద ఏర్పడితే ఈ నెంబర్ కు కాల్ చేసి సర్వీసులు పొందండి. మీ ఫ్రెండ్స్ కు కూడా 1033 నెంబర్ కు సంబంధించిన ప్రాముఖ్యత గురించి వివరించండి.
Read Also: రోడ్ల మీద ఉండే మైలు రాళ్లకు ఇన్ని రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక కహానీ ఏంటంటే?