BigTV English

Indian Railway TTE: రైల్వే TTE కావాలంటే.. ఎంత వరకు చదువుకోవాలి? ఏ ఎగ్జామ్ రాయాలో తెలుసా?

Indian Railway TTE: రైల్వే TTE కావాలంటే.. ఎంత వరకు చదువుకోవాలి? ఏ ఎగ్జామ్ రాయాలో తెలుసా?

How To Become A TTE In Indian Railways:  రైలు ప్రయాణం చేసే వారు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)ను చూసే ఉంటారు. ప్రయాణీకుల టికెట్లు చెక్ చేయడంతో పాటు రిజర్వేషన్ బోగీల్లోకి ఇతరులు రాకుండా చూస్తారు. సీట్ల కేటాయింపులో టీటీఈ కీలక పాత్ర పోషిస్తారు. టికెట్ లేకుండా ప్రయాణించే వారికి ఫైన్ విధించే అధికారం కూడా ఆయనకు ఉంటుంది.  రైల్వేలోని కీలక ఉద్యోగాల్లో ఒకటైన TTE జాబ్ పొందేందుకు కావాల్సిన విద్యార్హత, సెలెక్షన్ ప్రాసెస్, ప్రిపరేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


TTE జాబ్ కోసం కావాల్సిన క్వాలిఫికేషన్స్    

TTE ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి.


⦿ విద్యా అర్హత: దరఖాస్తుదారులు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా, దరఖాస్తుదారులు డిప్లొమా కోర్సును పూర్తి చేయాలి.

⦿పౌరసత్వం: దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి. అంతేకాదు, దేశంలోని ఏ రాష్ట్రం నుంచి అయినా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

⦿పరీక్ష వివరాలు: భారతీయ రైల్వే సంస్థ ప్రతి ఏటా TTE రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తుంది. ఎంపిక ప్రక్రియలో పరీక్షా కవరింగ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ కు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష 150 మార్కులకు 150 మల్టీఫుల్ ప్రశ్నలు అడుగుతారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, దరఖాస్తుదారులు TTE నిర్దిష్ట రైళ్లలో శిక్షణ తీసుకుంటారు.

⦿ ఫిజికల్ ఫిట్‌ నెస్: దరఖాస్తుదారులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్దేశించిన ఫిజికల్ క్వాలిఫికేషన్స్ కు  అనుగుణంగా ఉండాలి.

⦿ విజన్: దూర దృష్టి: 6/9,  నియర్ విజన్: 0.6/0.6 ఉండాలి.

⦿ ఇతర క్వాలిఫికేషన్స్: దరఖాస్తుదారులు తప్పనిసరిగా RRBచే సూచించబడిన అదనపు ఫిజికల్ ఫిట్‌ నెస్ పరీక్షలను ఫుల్ ఫిల్ చేయాలి.

⦿ జీతం మరియు ప్రయోజనాలు: TTE ఉద్యోగానికి సంబంధించి జీతం పే కమిషన్ ద్వారా నిర్ణయించబడుతుంది. తొలిసారి  గ్రేడ్ పేతో రూ. 5,200 తో కలిపి రూ. 20,200గా ఉంటుంది. రూ. 1,900 డియర్‌ నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA) అందిస్తారు. పే కమిషన్ ఎప్పటికప్పుడు సాలరీ పెంపును నిర్ణయిస్తుంది. ప్రస్తుతం TTEలకు రూ. 36 వేల వరకు అందిస్తున్నారు.

Read Also: ప్రపంచంలోని బెస్ట్ స్లీపర్ రైళ్లు ఇవే.. జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!

పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలంటే?

TTE ఉద్యోగానికి సంబంధించిన పరీక్షకు జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా దేశానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టు సాధించాలి. మ్యాథ్స్ కు సంబంధించిన బేసిక్స్ మీద బాగా దృష్టి పెట్టాలి. రీజనింగ్ విభాగంలో మంచి స్కోర్ చేసేందుకు లాజికల్ థింకింగ్ అవసరం. పరీక్షకు రెడీ అయ్యే ముందు గత ప్రశ్నా పత్రాలను బాగా చదవాల్సి ఉంటుంది. వాటిని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ కొనసాగితే కచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

Read Also: తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్‌ పై కీలక అప్‌డేట్.. టైమింగ్స్ మారాయా? నిజమేంటీ?

Related News

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Big Stories

×