Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ అనేది స్పెషల్ కేటగిరీ రైల్వే టికెట్. రైలు బయల్దేరడానికి ఒక్కరోజు ముందు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అత్యవసర పనులు ఉన్నవాళ్లకు తత్కాల్ టికెట్లు అనేవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే, తాజాగా రైల్వే సంస్థ తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్ లో మార్పులు చేసిందంటూ కొన్ని వార్తా సంస్థలు వార్తా కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణీకులు గందరగోళానికి గురయ్యారు. ఇంతకీ తత్కాల్ టికెట్ బుకింగ్స్ కు సంబంధించి టైమింగ్స్ మారాయా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
తత్కాల్ టికెట్ల టైమింగ్ మారిందా?
తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మారినట్లు రైల్వే సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎప్పటిలాగే AC క్లాసుల తత్కాల్ టికెట్ బుకింగ్స్ ప్రయాణానికి ఒక్క రోజు ముందు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి. నాన్-AC తరగతులకు సంబంధించిన బుకింగ్స్ 11 గంటలకు ప్రారంభం అవుతాయి. తత్కాలక టికెట్ బుకింగ్స్ టైమింగ్స్ పై రైల్వే సంస్థ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఒక PNRపై 4 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
ఇక తత్కాల్ బుకింగ్ కు సంబంధించి ఒక PNR నెంబర్ మీద గరిష్టంగా నలుగు ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. బుకింగ్ సమయంలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు లాంటి ఫ్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. రైలు రద్దు అయితే మాత్రమే తత్కాల్ టికెట్లకు రీఫండ్ అనేది వస్తుంది. మరే ఇతర సందర్భంలోనూ టికెట్ మొత్తం రీఫండ్ అయ్యే అవకాశం లేదు.
తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?
⦿ తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ముందుగా IRCTC వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
⦿ IRCTC సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇందుకోసం మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ IDని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
⦿ మీ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ చేసి, ‘ప్లాన్ మై జర్నీ’ సెక్షన్ కు వెళ్లాలి.
⦿ బయల్దేరే స్టేషన్, దిగాల్సిన స్టేషన్ తో పాటు జర్నీ డేట్ ఎంటర్ చేయాలి.
⦿ ఆ తర్వాత ‘బుకింగ్’ ట్యాబ్ కింద తత్కాల్ ఎంపికను సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ టికెట్ లభ్యత ఆధారంగా రైలు, క్లాస్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ఆ తర్వాత ప్రయాణీకుల పేర్లు, వయస్సు, గుర్తింపు వివరాలను యాడ్ చేయాలి.
⦿ఆ తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI, నెట్ బ్యాంకింగ్ లేదంటే డిజిటల్ వాలెట్ ను ఉపయోగించి చెల్లింపులు పూర్తి చేయాలి.
⦿ మీ చెల్లింపులు సక్సెస్ అయిన తర్వాత SMS, ఇమెయిల్ ద్వారా బుకింగ్ వివరాలను అందుకుంటారు.
తత్కాల్ టికెట్ల బుకింగ్ టిప్స్
కన్ఫామ్ తత్కాల్ టికెట్లను పొందాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. బుకింగ్ ప్రారంభం అయిన వెంటనే, చివరి రెండు నిమిషాల ముందుకు కాకుండా మధ్య సమయంలో లాగిన్ కావాలి. వీలైనంత వరకు త్వరగా చెల్లింపులు చేసేందుకు UPI లేదంటే నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించాలి. ప్రయాణీకులు లిస్టు ముందుగానే రెడీ చేసుకోవాలి. నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉండేలా చూసుకోవాలని రైల్వే నిపుణులు సూచిస్తన్నారు.
Read Also: ఈ టైమ్ లో తత్కాల్ టికెట్ బుక్ చేస్తే కచ్చితంగా కన్ఫామ్ కావాల్సిందే, అస్సలు మిస్ కాకండి!