Indian Railway Scheme: ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సులభంగా టికెట్లు తీసుకోవడంతో పాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణం చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే.. ప్రయాణీకులు ఈజీగా టికెట్లు బుక్ చేసుకునేలా ఓ స్కీమ్ ను తీసుకొచ్చింది. డబ్బులు లేకున్నా, టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. దీనికి ‘ఇప్పుడే బుక్ చేసుకోండి, తర్వాత చెల్లించండి’ అనే పథకాన్ని పరిచయం చేసింది. టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత 14 రోజుల్లోగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే..
ఈ పథకాన్ని పొందడం ఎలాగంటే..?
కొన్నిసార్లు రైల్వే ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉన్నా, చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడతారు. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే సంస్థ కొత్త పథకాన్ని పరిచయం చేసింది. ‘ఇప్పుడే బుక్ చేసుకోండి, తర్వాత చెల్లించండి’ అంటోంది IRCTC. ఈ స్కీమ్ లో భాగంగా మీరు ముందస్తుగా డబ్బులు చెల్లించకుండానే కన్ఫార్మ్ టికెట్ ను పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ అంతా ఆన్ లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది.
సింఫుల్ గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి!
‘ఇప్పుడే బుక్ చేసుకోండి, తర్వాత చెల్లించండి’ అనే పథకాన్ని పొందడానికి ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.
⦿ ముందుగా మీ IRCTC అకౌంట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత, ‘ఇప్పుడే బుక్ చేసుకోండి’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿ మీరు ప్రయాణీకుల వివరాలను, క్యాప్చా కోడ్ ను టైప్ చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దాన్ని ఫిల్ చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
⦿ చెల్లింపులకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. మీరు క్రెడిట్, డెబిట్, BHIM యాప్ తో పాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.
⦿ మీరు ‘పే లేటర్’ అనే అవకాశాన్ని వినియోగించుకోవాలంటే.. www.epaylater.in లో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
⦿ www.epaylater.in లో నమోదు చేసుకున్న తర్వాత.. మీకు చెల్లింపులకు సంబంధించి ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు ‘పే లేటర్’ అనే ఎంపికను సెలెక్ట్ చేసుకున్న తర్వాత, మీరు డబ్బులు లేకుండానే కన్ఫార్మ్ రైలు టికెట్ ను పొందే అవకాశం ఉంటుంది.
⦿ టికెట్ రిజర్వేషన్ తర్వాత 14 రోజుల్లోపు మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ చేయడం ఆలస్యం అయితే, 14 రోజుల తర్వాత ప్రయాణీకులు 3.5 శాతం సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి. నిర్ణీత కాలపరిమితిలోపు చెల్లింపు చేస్తే, ఎలాంటి అదనపు ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు.
Read Also: దేశంలో అత్యంత శుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవే, టాప్ 10లో ఒకే తెలుగు స్టేషన్ కు చోటు!