Indian Railways Tickets Booking: సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అంతేకాదు, టికెట్లు కూడా కొద్ది వారాల ముందుగానే బుక్ చేసుకుంటారు. ఒకటి, రెండు రోజుల ముందు ప్రయాణం ఖరారు అయితే, తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, చివరి నిమిషంలో వెళ్లాల్సి వస్తే? దానికీ IRCTC ఓ చక్కటి అవకాశం కల్పిస్తున్నది. రైలు బయల్దేరడానికి కొద్ది నిమిషాల ముందు కూడా కన్ఫర్మ్ టికెట్ పొందే సౌకర్యాన్ని అందిస్తున్నది. ఇంతకీ ఈ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
‘కరెంట్ టికెట్ సిస్టమ్’ అవకాశాన్ని వినియోగించుకోండి!
వాస్తవానికి గతంలో ఛార్ట్ ప్రిపేర్ కావడానికి కొద్ది గంటల ముందు వరకు కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు IRCTC ‘కరెంట్ టికెట్ సిస్టమ్’ పేరుతో రైలు బయల్దేరడానికి కొద్ది నిమిషాల ముందు వరకు కన్ఫర్మ్ టికెట్ పొందే ఛాన్స్ కల్పిస్తున్నది. కొద్ది మంది ప్రయాణీకులు అనివార్య కారణాలతో చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారు. ఆ ఖాళీ టికెట్లను అవసరమైన ప్రయాణీకులకు అందించేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం రైల్వే సంస్థ రెండు ఛార్ట్ లను ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ ఛార్ట్ అనేది రైలు బయల్దేరడానికి 3 నుంచి 4 గంటల ముందు రూపొందిస్తారు. రెండో ఛార్ట్ అనేది రైలు బయల్దేరడానికి కొద్ది నిమిషాల ముందు రెడీ చేస్తారు. అయితే, ఇప్పుడు రైలు ప్రయాణాన్ని ప్రారంభించడానికి కొద్ది నిమిషాల ముందు వరకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ఇంతకీ చివరి నిమిషంలో టికెట్ ఎలా పొందాలంటే?
రైలు బయల్దేరే కొద్ది నిమిషాల ముందు వరకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, రైళ్లు ముందు బెర్తులు ఖాళీగా ఉన్నాయో? లేదో? తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంతకీ రైల్లో సీట్ల ఖాళీలను ఎలా తెలుసుకోవాలంటే? ముందుగా IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ ను ఓపెన్ చేసి ట్రైన్ సింబల్ మీద ట్యాప్ చేయాలి. ఛార్ట్ వెయికెన్సీ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లిస్టును క్లిక్ చేయాలి. మీరు వెళ్లాల్సిన రైలు పేరు, నెంబర్, ఎక్కాల్సిన స్టేషన్ వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ‘గెట్ ట్రైన్ ఛార్ట్’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. వెంటనే మీరు కోరుకున్న రైల్లో ఉన్న ఖాళీ సీట్ల వివరాలను కనిపిస్తాయి. క్లాసుల వారీగా అంటే ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఛైర్ కార్, స్లీపర్ క్రమంలో ఖాళీ సీట్ల వివరాలు కనిపిస్తాయి. బెర్త్ ఖాళీగా ఉంటే మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ టికెట్లు లేకపోతే జీరో అని కనిపిస్తుంది. రైలు ప్రారంభం అయ్యే స్టేషన్ తో పాటు మరో రెండు స్టేషన్లలో ఎక్కే వారికి ఈ సదుపాయం చాలా ఉపయోగపడుతుంది. అయితే, ‘కరెంట్ టికెట్ బుకింగ్’ టైమ్ లో కన్ఫర్మ్ టికెట్లు మాత్రమే బుక్ చేయబడుతాయి. సీనియర్ సిటిజన్లతో పాటు దివ్యాంగులకు మాత్రమే రాయితీలు అనుమతించబడుతాయి.
Read Also: ఇ-టికెట్ ఉన్నా.. ఇది లేకపోతే జరిమానా కట్టాల్సిందే! రైల్వే కొత్త రూల్ గురించి తెలుసా?