ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చే రవాణా వ్యవస్థలో కీలకమైనవి రైల్వేలు. నిత్యం రైల్వేల ద్వారా కోట్లాది మంది ప్రయాణీకులు జర్నీ చేస్తుంటారు. అలాంటి రైల్వేలో కొన్ని ప్రమాదకరమైన మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
⦿ అర్గో గెడే ట్రైన్ రైల్‌రోడ్, ఇండోనేషియా
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రైల్వే మార్గంలో ఇది ఒకటి. జకార్తా- బాండుంగ్ ను కనెక్ట్ చేస్తుంది. సుమారు 3 గంటల ప్రయాణం ఉంటుంది. ఇండోనేషియాలో అత్యంత ఎత్తైన పర్వతాలు, లోయల నడుమ ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఈ జర్నీ చేయడానికి చాలా ధైర్యం కావాలి.
⦿ అసో మినామి రూట్, జపాన్
ఈ రైలు మార్గం జపాన్ లోని అగ్నిపర్వతాల ప్రాంతం మీదగా వెళుతుంది. ఈ ప్రయాణం చేసే ప్యాసెంజర్లు లావాను, లావా కారణంగా దెబ్బతిన్న అడవులను చూసి ఆశ్చర్యపోతారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు అగ్ని పర్వాతలు బద్దలవుతాయో తెలియక భయపడుతారు.
⦿ జార్జ్ టౌన్ లూప్ రైల్‌రోడ్, అమెరికా
ఈ రైలు అత్యంత ప్రమాదకరమైన వంతెన మీదుగా ప్రయాణిస్తుంది. 100 అడుగుల పొడవులో ఉన్న ఈ బ్రిడ్జిని రైలు జాగ్రత్తగా దాటుతుంది.
⦿ వైట్ పాస్ అండ్ యుకాన్ రూట్, అమెరికా
అమెరికాలోని మరో ప్రమాదకరమైన మార్గం వైట్ పాస్ అండ్ యుకాన్ రూట్. 1898లో నిర్మించబడిన ఈ రైల్వే లైన్ సుమారు 20 మైళ్లు ఉంటుంది. కొండలు, లోయల నడుమ కొనసాగే ఈ మార్గంలో టూరిస్టులు థ్రిల్ ఎంజాయ్ చేస్తుంటారు.
⦿ ట్రెన్ ఎ లాస్ నుబ్స్, అర్జెంటీనా
చిలీ సరిహద్దుకు సమీపంలో నార్త్ సెంట్రల్ అర్జెంటీనాలో ఉన్న ఈ రైల్వే పూర్తి చేయడానికి 27 సంవత్సరాలు పట్టింది. ఇది 21 టన్నెల్స్, 13 బ్రిడ్జిల మీదుగా వెళ్తుంది. స్పైరల్, జిగ్ జాగ్ ట్రాక్‌లను కలిగి ఉంటుంది.
⦿ చెన్నై-రామేశ్వరం రూట్, ఇండియా
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర రైల్వే మార్గాల్లో ది ఒకటి. ఈ రైలు మార్గం సుమారు 2,065 మీటర్లు సముద్రంలో ప్రయాణిస్తుంది. ఈ కాంటిలివర్ బ్రిడ్జి భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.
⦿ కురండ సీనిక్ రైల్ రోడ్, ఆస్ట్రేలియా
ఈ రైలు బారన్ జార్జ్ నేషనల్ పార్క్ మీదుగా వెళ్తుంది. రైలు నడుస్తుంటే జలపాతాల నీళ్లు పడుతూ ఆహ్లాదంగా కనిపిస్తుంది. అద్భుతమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ రూట్ దట్టమైన అరణ్యాల నడుమ వెళ్తుంది.
⦿ ది డెత్ రైల్వే, థాయిలాండ్
మయన్మార్(బర్మా) సరిహద్దులో ఉన్న థాయ్‌లాండ్‌లోని కాంచనబురి ప్రావిన్స్ గుండా ఈ ప్రయాణం కొనసాగుతుంది. క్వాయ్ నదిపై ఉన్న ఐకానిక్ బ్రిడ్జి మీదుగా రైలు ప్రయాణం చేసే సమయంలో ప్యాసెంజర్లు ప్రాణాలు బిగపట్టుకోవాల్సి ఉంటుంది.
⦿ డెవిల్స్ నోస్ రైలు, ఈక్వెడార్
సముద్ర మట్టానికి 9 వేల అడుగుల ఎత్తులో ఆండీస్ పర్వతాల మీదుగా ఈ ప్రయాణం కొనసాగుతుంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర రైలు మార్గాలలో ఒకటిగా ఉంది.
⦿ ఔటెనిక్వా చూ ట్జో రైలు, దక్షిణాఫ్రికా
ఈ రైలు మార్గం 1908లో ప్రారంభించబడింది. హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించే ఈ రైలు మార్గం ప్రయాణీకులకు థ్రిల్ తో పాటు భయం కలిగిస్తుంది.
Read Also: రైల్వే టికెట్ బుకింగ్స్‌కు ఇక ‘సూపర్’ యాప్.. దీనికి, ఐఆర్‌సీటీసీ యాప్‌కు తేడా ఇదే!