New Zealand Black Flights: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానాలకు సాధారణంగా తెలుపు రంగు ఉంటుంది. వైట్ కలర్ అనేది సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. వేడిని కంట్రోల్ చేసి విమానం లోపలి భాగాన్ని చల్లగా ఉంచడంలో సాయపడుతుంది. వైట్ కలర్ విమానం పగుళ్లు, తుప్పు పట్టకుండా కాపాడుతుంది. పెయింట్ ఖర్చులను తగ్గిస్తుంది. తక్కువ బరువుతో పాటు ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వైట్ కలర్ స్పష్టంగా కనిపిస్తూ పక్షులు అడ్డు తగలకుండా చేస్తుంది.
న్యూజిలాండ్ విమానాలకు నలుపు రంగు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానాలకు తెలుపు రంగు ఉన్నప్పటికీ ఎయిర్ న్యూజిలాండ్ తన విమానాలలో కొన్నింటి బ్లాక్ కలర్ వేసింది. తన జాతీయ కలర్ ను ప్రతిబింబించేలా తమ విమానాలకు నలుపు రంగు వేసింది. 2002లో రగ్బీ వరల్డ్ కప్ సందర్భంగా తమ బోయింగ్ 777 విమానాలకు బ్లాక్ పెయింట్ వేసింది. ఇప్పుడు ప్రతి ఫ్లీట్ మోడల్ లో బ్లాక్ పెయింటెడ్ విమానాన్ని కలిగి ఉంది.
విమానాలకు వైట్ కలర్ ఎందుకు వేస్తారు?
ప్రధానంగా వైట్ పెయింట్ అనేది ఉష్ణోగ్రత నియంత్రణతో పాటు ఇంధన సామర్ధ్యాన్ని పెంచడంలో సాయపడుతుంది. సూర్యరశ్మిని రిఫ్లెక్ట్ చేస్తుంది. టార్మాక్ పై పార్క్ చేసినప్పుడు విమానం లోపలి భాగాన్ని చల్లగా ఉంచడంలో సాయపడుతుంది. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మీద భారాన్ని తగ్గిస్తుంది. ఇంధన పొదుపుకు ఉపయోగపడుతుంది. తెలుపు పెయింట్ సాధారణంగా ముదురు రంగుల కంటే తేలికగా ఉంటుంది. విమానానికి సంబంధించి ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గిస్తుంది.
స్పష్టం కనిపించడం, పక్షుల నుంచి భద్రత
విమానానికి తెల్ల రంగు వేయడం మూలంగా నీలి ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తుంది. పక్షలు విమానాన్ని ఢీకొనే ముప్పు తగ్గుతుంది. తరచుగా పక్షులు గాలిలో విమానాలను తాకుతుంటాయి. వైట్ కలర్ అనేది పక్షులు దూరంగా ఉండేలా చేయడంతో పాటు విమాన భద్రతకు ఉపయోగపడుతుంది. ఎయిర్ ఫ్రాన్స్ 1976లో ‘యూరో వైట్’ లివరీని ప్రవేశపెట్టినప్పటి నుండి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానాలకు తెలుపు రంగును వేస్తున్నారు.
ఎయిర్ న్యూజిలాండ్ కు మినిహాయింపు ఎందుకు?
ఎయిర్ న్యూజిలాండ్ సంప్రదాయ తెలుపు రంగుకు భిన్నంగా తన విమానానికి పూర్తిస్థాయి నలుపు రంగును వేసింది. న్యూజిలాండ్ జాతీయ రంగును ప్రతిబింబించేలా ఆల్ బ్లాక్ రూపాన్ని ఆవిష్కరించింది. ఫ్రాన్స్ లో జరిగిన రగ్బీ ప్రపంచ కప్ కు సపోర్టుగా ఈ ఎయిర్ లైన్ తన బోయింగ్ 777 విమానానికి అద్భుతమైన బ్లాక్ కలర్ ను వేసింది. ఆ తర్వాత ఎయిర్ న్యూజిలాండ్ తన విమానికి నలుపు రంగు వేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ప్రస్తుతం ఫ్లీట్ లోని ప్రతి మోడల్ లో నలుపు రంగు విమానాలను కలిగింది. బ్లాక్ సెలెక్షన్ న్యూజిలాండ్ జాతీయ గుర్తింపును గౌరవిస్తుంది. ఆ దేశంలో నలుపు అనేది సాంస్కృతికంగా ఐకానిక్ కలర్. ఎయిర్ న్యూజిలాండ్ బ్లాక్ పెయింట్ విమానాలు ఇతర విమానయాన సంస్థల నుంచి ప్రత్యేకంగా ఉంటాయి. దాని విమానాలను సులభంగా గుర్తించగలిగేలా చేస్తుంది. ఈ బోల్డ్ డిజైన్ బ్రాండ్ విజిబిలిటీని పెంచుతుంది. మార్కెట్‌లో ఎయిర్‌లైన్ గుర్తింపు మరింతగా పెంచుతుంది.
ఎయిర్ న్యూజిలాండ్ విమానాలకు బ్లాక్ కలర్ ఎందుకు?
బ్లాక్ పెయింట్ తమ విమానాల పనితీరు, మెయింటెనెన్స్, ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుందని న్యూజిలాండ్ ఎయిర్ లైన్ ప్రతినిధులు తెలిపారు. విమానాన్ని సురక్షితంగా ఉంచడంలో సాయపడుతుందన్నారు. “నలుపు అనేది ఐకానిక్ కివీ రంగు. ఇది న్యూజిలాండ్ జాతీయ గుర్తింపుకు చిహ్నం. తమ విమానాలకు నలుపు రంగు వేయిడం పట్ల దేశం గర్వంగా ఫీలవుతుంది” అని వెల్లడించారు. ఎయిర్ న్యూజిలాండ్ బోయింగ్ 777-300ER ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ బ్లాక్ పెయింటెడ్ విమానంగా గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: వందే భారత్ రైళ్లలో విపరీతమైన రద్దీ.. ఈ రూట్లలో పెరగనున్న కోచ్‌ల సంఖ్య!