Indian Railways SwaRail App: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నది. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట పొందేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే సరికొత్త సూపర్ యాప్ ను పరిచయం చేసింది. ‘స్వరైల్’ (SwaRail) పేరుతో ఈ యాప్ ను రిలీజ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ యాప్ అందిరికీ అందుబాటులో లేదు. ఎందుకంటే ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉన్నది. చాలా మంది ఈ యాప్ ను Google Play Store, Apple యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీ ఫోన్ లో ఈ యాప్ ఓపెన్ కాకపోతే సింఫుల్ గా ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
⦿ అప్ డేట్స్ చెక్ చేయండి: మీ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్ స్టాల్ చేసుకున్నారో? లేదో? చూడండి. వీలైనంత వరకు తాజా వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది.
⦿ ఈ ఫోన్ ను రీస్టార్ట్ చేయండి: కొన్నిసార్లు ఫోన్ హ్యాంగ్ కావడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. యాప్స్ ఓపెన్ కావు. అలాంటి సమయంలో ఫోన్ ను రీస్టార్ట్ చేసుకోవాలి.
⦿యాప్ కాష్, డేటాను క్లియర్ చేయండి: మీ ఫోన్ లోని సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. SwaRail యాప్ ను గుర్తించండి. దాని కాష్, డేటాను క్లియర్ చేయండి. యాప్ సరిగా పని చేసే అవకాశం ఉంటుంది.
⦿ యాప్ ను మళ్లీ ఇన్ స్టాల్ చేయండి: ఎంతకీ యాప్ ఓపెన్ కాకపోతే సింఫుల్ గా SwaRail యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసి, అఫీషియల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటే పోయి, యాప్ ఈజీగా రన్ అవుతుంది.
⦿ మీ ఫోన్ అనుకూలంగా ఉందా?: మీరు వాడే ఫోన్ ఈ యాప్ అవసరాలకు అనుగుణం ఉందో? లేదో? గుర్తించండి. అనుకూలమైన ఓఎస్ ఉంటే ఈ యాప్ పని చేస్తుంది.
⦿ పర్మిషన్స్ ను చెక్ చేయండి: యాప్ సరిగా పని చేయడానికి కొన్ని పర్మిషన్స్ అవసరం ఉంటుంది. మీ యాప్ లో అవసరం అయిన పర్మిషన్స్ ఇస్తూ సెట్టింగ్స్ మార్చుకోండి. అప్పుడు యాప్ పని చేసే అవకాశం ఉంటుంది.
⦿ ఇంటర్నెట్ సరిగా ఉందో? లేదో చూసుకోండి: ఈ యాప్ పని చేయాలంటే ఇంటర్నెట్ సౌకర్యం సరిగా ఉండాలి. అందుకే మీ ఫోన్ లో స్టేబుల్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో? లేదో? పరిశీలించండి.
ఈ సెట్టింగ్స్ అన్నీ చేసిన తర్వాత మీ యాప్ పని చేస్తుంది. ఒకవేళ అప్పటికీ మీ ఫోన్ లో స్వరైల్ యాప్ పని చేయకపోతే రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా సపోర్టు తీసుకోండి. ఇందుకోసం swarail.support@cris.org.in ను ఓపెన్ చేయండి. మీ ఫోన్ కు సంబంధించిన వివరాను వారికి అందిస్తే, మీ సమస్యను పరిష్కరించి యాప్ ఓపెన్ అయ్యేలా చూస్తారు. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉన్నందున మరికొద్ది రోజుల పాటు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
Read Also: వందే భారత్ రైల్లో కమ్ముకున్న పొగ, అసలు సంగతి తెలిసి ప్రయాణీకులు షాక్!