Indian Railways: వినాయక చవితి సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రహదారులపై రద్దీని తగ్గించడమే లక్ష్యంగా కొంకణ్ రైల్వే చర్యలు తీసుకుంటున్నది. రైలు వ్యాగన్ల మీద కార్లను రవాణా చేసేలా సన్నాహాలు చేస్తోంది. కొంకణ్ రైల్వే సీఎండీ సంతోష్ కుమార్ ఝా ఈ విషయానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, టెక్నికల్ గా సాధ్యమేనని వెల్లడించారు. త్వరలోనే ఈ రవాణా విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
రోల్ ఆన్ రోల్ ఆఫ్ మోడల్ లో..
ఇప్పటికే ట్రక్కులను రైలు వ్యాగన్ల మీద రవాణా చేస్తున్నారు. రోల్-ఆన్ రోల్-ఆఫ్ (రో-రో) మోడల్ లో వాహనాలను ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలిస్తున్నారు. వాహనాలను ర్యాంప్ ద్వారా వ్యాగన్‌ల పైకి ఎక్కిస్తారు. ప్రతి ట్రక్కును ఎక్కేందుకు అనుమతించే ముందు బరువు, ఎత్తు (3.425 మీటర్ల వరకు) కోసం తనిఖీ చేస్తారు. డ్రైవర్, క్లీనర్ సాధారణ టిక్కెట్లతో వారి ట్రక్ క్యాబిన్లలో ప్రయాణిస్తారు. కనీసం 40 ట్రక్కులు ఉన్నప్పుడే రైలు మీద తీసుకెళ్తారు. ఇప్పుడు కార్లతో పాటు SUVలను అలాగే తీసుకెళ్లనున్నారు. అయితే, భద్రతా తనిఖీలతో పాటు చిన్న వాహన కొలతలకు సరిపోయేలా వ్యాగన్లకు కొత్త మార్పులు చేయనున్నారు. వాహనాలను కోలాడ్, ప్రస్తుత రో-రో టెర్మినల్‌కు తీసుకెళ్లాలి. తగిన సంఖ్యలో కార్లు ఉన్నప్పుడే రవాణా చేస్తారు.
మాన్ సూన్ టైమ్ టేబుల్ కుదింపు
అటు కొంకణ్ రైల్వే రుతుపవనాల టైమ్ టేబుల్ ను 10 రోజులు కుదించింది. జూన్ 15 నుంచి అక్టోబర్ 20 వరకు అమలులో ఉంటుందని వెల్లడించింది. ఈ సమయంలో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోబడుతాయని వెల్లడించారు. 600 కంటే ఎక్కువ మంది శిక్షణ పొందిన సిబ్బంది, సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ కాస్తారు. 9 స్టేషన్లలో LED సిగ్నల్స్, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అందుబాటులో ఉంచుతారు. కీలకమైన నది వంతెనల దగ్గర వరద హెచ్చరికలు కూడా అమలులో ఉంటాయి. పెర్నెమ్, ఓల్డ్ గోవాలో కొత్త సొరంగాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం అవుతుండగా, మడ్గావ్, ఉడిపి స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అప్ గ్రేడ్ కోసం ఎంపిక చేయబడ్డాయి. త్వరలోనే ఈ పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
Read Also: 32 రైళ్లకు అదనపు కోచ్ లు, తెలుగు ప్రయాణీకులకు ఆ కష్టాలు తీరినట్లే!
రహదారి ట్రాఫిక్ తగ్గించడమే లక్ష్యంగా
కొత్తగా అందుబాటులోకి రానున్న కొంకణ్ రైల్వే కార్ ఫెర్రీ ప్రాజెక్ట్ రోడ్డు ట్రాఫిక్‌ను గణనీయంగా గణనీయంగా తగ్గించమే లక్ష్యంగా పెట్టుకుంది. అనుకూలమైన, సురక్షితమైన, సమర్థవంతమైన ప్రయాణ ప్రత్యామ్నాయాన్ని అందించడం ద్వారా పండుగ ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చగలదు. ఇప్పటికీ ప్రయోగాత్మకంగా ఉన్నప్పటికీ, ఈ ప్రణాళిక ప్రయాణీకుల సౌలభ్యం పట్ల రైల్వే నిబద్ధతకు నిర్శనంగా నిలువనుంది. వాహనదారులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక చోటు నుంచి మరో చోటుకు హ్యాపీగా వెళ్లే అవకాశం ఉంటుంది.
Read Also: బుల్లెట్ ట్రైన్ బిగ్ అప్ డేట్, 12 స్టేషన్లతో రూట్ మ్యాప్ వచ్చేసింది!