BigTV English

East Coast Railway: 32 రైళ్లకు అదనపు కోచ్ లు, తెలుగు ప్రయాణీకులకు ఆ కష్టాలు తీరినట్లే!

East Coast Railway: 32 రైళ్లకు అదనపు కోచ్ లు, తెలుగు ప్రయాణీకులకు ఆ కష్టాలు తీరినట్లే!
Advertisement

Indian Railways: వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజలు తమ సొంత గ్రామాల నుంచి నగరాలకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నాయి. అధిక డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నెల(జూన్)లో 32 రైళ్లను అదనపు కోచ్ లో నడిపించాలని నిర్ణయించింది. AC 2-టైర్, AC 3-టైర్, స్లీపర్ క్లాస్, చైర్ కార్‌తో సహా ఇతర కోచ్ లను యాడ్ చేయబోతోంది. ఈ రైళ్లు న్యూఢిల్లీ, హౌరా, యశ్వంత్‌ పూర్, పాట్నా, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, కిరండూల్ వంటి కీలక గమ్యస్థానాలను కవర్ చేస్తాయి. ప్రధాన మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు మెరుగైన సౌలభ్యం, ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల వరకు కొనసాగుతాయని వెల్లడించారు.


అదనపు కోచ్ లు పెంచిన రైళ్ల వివరాలు

⦿ విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్ (58506/58505): ఈ రైలుకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ను పెంచారు. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు నడపనున్నారు.


⦿ విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502): ఈ రైలుకు కూడా స్లీపర్ కోచ్ ను యాడ్ చేశారు.  జూన్ 1 నుండి 30 వరకు (విశాఖపట్నం నుంచి), జూన్ 2 నుండి జూలై 1 వరకు (కిరండూల్ నుంచి) ఈ కోచ్ అందుబాటులో ఉంటుంది.

⦿ విశాఖపట్నం-బెంగళూరు స్పెషల్ (08581/08582): ఈ రైలుకు ఒక AC 3-టైర్ కోచ్ ను అదనంగా జత చేయనున్నారు. జూన్ 1 నుంచి 29 వరకు (విశాఖపట్నం నుంచి) / జూన్ 2 నుంచి 29 వరకు (బెంగళూరు నుంచి) ఈ కోచ్ అందుబాటులో ఉంటుంది.

⦿ విశాఖపట్నం-తిరుపతి స్పెషల్(08547/08548): ఈ రైలుకు ఒక AC 3-టైర్ కోచ్ జతచేయనున్నారు. జూన్ 4 నుంచి 25 వరకు (విశాఖపట్నం నుంచి),  జూన్ 5 నుంచి 26 వరకు (తిరుపతి నుండి) ఈ అదనపు కోచ్ తో రైలు నడవనుంది.

⦿ విశాఖపట్నం-చర్లపల్లి స్పెషల్(08579/08580): విశాఖపట్నం- చర్లపల్లి మధ్య రాకపోకలు కొనసాగించే ఈ ప్రత్యేక రైలుకు  అదనంగా ఒక AC 3-టైర్ కోచ్ ను యాడ్ చేయనున్నారు. జూన్ 6 నుంచి 27 వరకు (విశాఖపట్నం నుంచి),  జూన్ 7 నుంచి 28 వరకు (చర్లపల్లి నుంచి) ఈ కోచ్ అందుబాటులో ఉంటుంది.

Read Also: ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? కొత్త రూల్స్ గురించి తెలియకపోతే బుక్కైపోతారు!

అటు  భువనేశ్వర్ – హౌరా జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ – న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్,  భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని, భువనేశ్వర్-జునాగఢ్ రోడ్ ఎక్స్‌ప్రెస్, పూరి-షాలిమార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, పూరి–యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్,  పూరి–బంగిరిపోసి ఎక్స్‌ప్రెస్, పూరి–పాట్నా స్పెషల్, సంబల్‌పూర్–నాందేడ్ ఎక్స్‌ప్రెస్, సంబల్‌పూర్-ఈరోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా అదనపు కోచ్ లను యాడ్ చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఆయా మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లు సమీప రైల్వే స్టేషన్లతో పాటు ఇండియన్ రైల్వే అధికారిక వెబ్ సైట్ ఈ వివరాలను తెలుసుకోచ్చన్నారు.

Read Also: 60 సెకెన్లలో కన్ఫర్మ్ టికెట్ బుకింగ్, సింఫుల్ గా ఇలా చేయండి!

Related News

Train Tickets: గుడ్ న్యూస్, ఇక పోస్టాఫీసులోనూ రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా!

Indian Railways: రన్నింగ్ ట్రైన్ లో శిశువుకు శ్వాస సమస్య, ఆర్మీ జవాన్ ఏం చేశాడంటే?

Tirupati Train Timings: తిరుపతి వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఆ ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది!

Indian Railways: రైలు నుంచి పడి చనిపోయిన భర్త.. పరిహారం ఇవ్వని రైల్వే, సుప్రీం కోర్టు ఊహించని తీర్పు!

Fire Accident: ఎయిర్ పోర్టులో మంటలు, విమానాల రాకపోకలు బంద్!

Fire in Flight: గాల్లో ఉండగా విమానంలో మంటలు, భయంతో వణికిపోయిన ప్రయాణీకులు!

Diwali 2025: దీపావళిని ఏయే రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారో తెలుసా? ఒక్కోచోట ఒక్కో సాంప్రదాయం!

Fire Accident: గరీబ్‌రథ్ రైలులో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..

Big Stories

×