Samsung Galaxy Tab S12: టెక్ మార్కెట్లో ఎప్పుడూ ఏదో ఒక కొత్త గ్యాడ్జెట్ హడావుడి చేస్తూనే ఉంటుంది. అందులోనూ శాంసంగ్ నుంచి కొత్త డివైజ్ వస్తుందంటే టెక్ ప్రియుల ఫోకస్ అంతా దానిపైనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తిని పెంచుతున్న మరో వార్త ఏంటంటే.. ‘శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్12 సిరీస్’ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతుందట. లీకైన సమాచారం ప్రకారం ఈ కొత్త ట్యాబ్లెట్లను అక్టోబర్ 7న శాంసంగ్ లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి గెలాక్సీ ట్యాబ్ ఎస్12 సిరీస్‌లో ఎలాంటి కొత్త ఫీచర్లు ఉండబోతున్నాయి? డిజైన్ నుంచి స్పెసిఫికేషన్ల వరకు ఏం మారబోతోంది? ఇప్పుడు చూద్దాం.
ఈసారి శాంసంగ్ ఒక్కటే కాకుండా.. ఏకంగా మూడు మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్12తో పాటు ఎస్12 ప్లస్, ఇంకా పవర్‌ఫుల్ ఫీచర్లతో ఎస్12 అల్ట్రా మోడల్స్ రానున్నాయి. ప్రముఖ టిప్‌స్టెర్ షేర్ చేసిన ఒక చిన్న ఫొటో ద్వారా ఈ లాంచ్ డేట్ బయటకు వచ్చింది. అయితే కంపెనీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా సరే లీకైన వివరాలు చూస్తుంటే టెక్ లవర్స్‌లో అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.
Also Read: రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!
ఈ కొత్త ట్యాబ్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉండేలా కనిపిస్తోంది. ట్యాబ్ పైభాగంలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ ఇచ్చినట్లు లీకైన ఇమేజ్ ద్వారా స్పష్టమవుతోంది. సైడ్ బటన్లు, వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ సాధారణ ట్యాబ్లెట్ల మాదిరిగానే ఉన్నాయి. ముఖ్యంగా అల్ట్రా మోడల్ పెద్ద ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుండటం విశేషం. సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ట్యాబ్లెట్లలో ఎస్ పెన్ సపోర్ట్ కూడా ఉండనుంది. దీంతో నోట్స్ రాసుకోవడానికి, బొమ్మలు గీయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ సిరీస్‌లో అసలు మ్యాటర్ పెర్ఫార్మెన్స్ గురించే చెప్పాలి. గెలాక్సీ ట్యాబ్ ఎస్12 అల్ట్రా మోడల్ గీక్‌బెంచ్ సైట్‌లో కనిపించడంతో దీనిలోని ప్రాసెసర్ వివరాలు లీకయ్యాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ఉండొచ్చని సమాచారం. ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్, ఏకంగా 12GB ర్యామ్‌తో ఇది రానుంది. హెవీ గేమింగ్ ఆడే వారికి, ఒకేసారి అనేక పనులు చేసే వారికి ఈ ట్యాబ్ పర్‌ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.
సాధారణంగా శాంసంగ్ ఎ సిరీస్ ట్యాబ్లెట్లు బడ్జెట్ ధరలో లభిస్తాయి. కానీ ఎస్ సిరీస్ మాత్రం పూర్తిగా హై-ఎండ్ యూజర్లను టార్గెట్ చేస్తుంది. గతంలో వచ్చిన ట్యాబ్ ఎస్11 లాంటి మోడల్స్‌తో పోలిస్తే.. ఈసారి ట్యాబ్ ఎస్12 సిరీస్ హార్డ్‌వేర్ పరంగా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. కెమెరా విషయంలో కూడా డ్యూయల్ రియర్ సెటప్ ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ 7న జరిగే అసలు ఈవెంట్‌లో శాంంసంగ్ ఈ ట్యాబ్ ధరలు, ఇతర ఫీచర్లపై క్లారిటీ ఇస్తుంది. అప్పటివరకు ఈ లీకులతో సరిపెట్టుకోవాల్సిందే.
Also Read: iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!