Indian Railways: స్మార్ట్, సస్టెయినబుల్ మొబిలిటీ రంగంలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతున్న ఆల్ స్టామ్ ఇండియాలో అరుదైన ఘనత సాధించింది. భారతీయ రైల్వేకు 500వ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ను సక్సెస్ ఫుల్ గా అందించింది. ఇండియన్ రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణకు సపోర్టు చేయడంతో పాటు సరుకు రవాణా లక్ష్యాలకు చేరుకునేందుకు ఆల్ స్టామ్ ఎంతగానో కృషి చేస్తోంది. అందులో భాగంగానే పూర్తిగా భారత్ లోనే తయారు చేసిన 500వ(ప్రైమా T8 WAG12B) ఇ-లోకోమోటివ్ ను అందజేసింది. బీహార్ మాధేపురలోని ఆల్ స్టామ్ వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ నుంచి ఈ లోకోను ప్రారంభించారు.
WAG-12B లోకోమోటివ్‌ల గురించి..
ఆల్ స్టామ్, ఇండియన్ రైల్వే జాయింట్ వెంచర్ కింద మాధేపురలో దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ లో WAG-12B లోకోమోటివ్‌లను నిర్మిస్తున్నారు. ఇది భారత రైల్వేరంగంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రాజెక్ట్. ఈ కంపెనీ ద్వారా సంవత్సరానికి 120 లోకోమోటివ్ లను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఆల్ స్టోమ్ ప్రస్తుతం సుమారు 90% స్థానికంగానే తయారు చేస్తున్నారు. ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్‌లు (IGBT) ఆధారిత ప్రొపల్షన్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ ఇ-లోకోమోటివ్ లు రీజెనరేటివ్ బ్రేకింగ్ కారణంగా పవర్ ను చాలా వరకు సేవ్ చేస్తుంది. ఈ సాంకేతికత కారణంగా వేడి ఉత్పత్తి, ట్రాక్షన్ సౌండ్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఈ లోకోమోటివ్ లు ఆపరేషనల్ కాస్ట్ ను కూడా విపరీతంగా తగ్గిస్తుంది.
800 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ల తయారీ
ఆల్ స్టోమ్ భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సరుకు రవాణా కోసం 12,000 HP (9 MW) సామర్థ్యం గల 800 హై-పవర్డ్ డబుల్-సెక్షన్ ప్రైమా T8 లోకోమోటివ్ లను సరఫరా చేయాల్సి ఉంది. ఈ WAG-12B లోకోమోటివ్‌లు 120 kph గరిష్ట వేగంతో పాటు 6,000 టన్నుల రేక్‌లను రవాణా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దేశంలో అత్యంత అధునాతన సరుకు రవాణా లోకోమోటివ్ లలో ఇది టాప్ లో ఉంటుంది. అంతేకాదు, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడానికి ఆల్ స్టోమ్ సహారన్ పూర్, నాగ్ పూర్ లో రెండు అత్యాధునిక మెయింటెనెన్స్ డిపోలను కూడా నిర్మించింది.
Big Beast 😍 of Indian Railway #WAG12B
.
.
.
.@AshwiniVaishnaw @dfccil_india @RailMinIndia @AlstomIndia pic.twitter.com/YouZ6zwGp4— Mohit Kumar (@DetoxTravellerr) March 23, 2024
సరుకు రవాణాలో కీలక ముందడుగు
WAG-12B లోకోమోటివ్ భారతీయ రైల్వే సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తుందని ఆల్ స్టోమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆలివర్ లోయిసన్ వెల్లడించారు. “అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే WAG 12B ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు పూర్తిగా భారత్ లో తయారు చేయబడ్డాయి. దేశ వ్యాప్తంగా సరుకు రవాణా రంగంలో మెరుగైన వేగం, సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. 500వ ఇ లోకో డెలివరీ దేశ రైల్వే మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా సరుకు రవాణా కోసం రంగాన్ని ఆధునీకరించడానికి ఎంతగానో ఉపయోగపడనుంది.
Read Also: పైసా ఖర్చులేకుండా ఏడాదిగా ట్రైన్ లో ఫ్రీ జర్నీ, ప్రయాణీకుడి తెలివికి రైల్వే అధికారుల షాక్!