BigTV English

Ghaati: అనుష్క ‘ఘాటి’ వాయిదా!

Ghaati: అనుష్క ‘ఘాటి’ వాయిదా!

Ghaati: టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి (Anushka Shetty) గురించి తెలిసిందే. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలింది అమ్మడు. ఒక వైపు స్టార్ హీరోలతో నటిస్తూ, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన సత్తా చాటుతూ అగ్ర కథానాయికగా ఎదిగింది. ‘బాహుబలి’ లాంటి పాన్ ఇండియా విజయం తర్వాత ఆమె సినిమాల ఎంపికలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ, ముఖ్యంగా కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో చేసిన సినిమాల్లో ‘భాగమతి’ (Bhagamathi) పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ.. ‘నిశ్శబ్దం’ (Nishabdham) మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ఆ తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty)తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు స్వీటీ. చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఘాటి (Ghaati) అనే సినిమాలో నటిస్తోంది. అయితే.. ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యేలా లేదు.


Also Read: షాకింగ్.. నీల్ మావా ఫుల్ బాటిల్ లేపేయ్, కానీ ఎన్టీఆర్‌తో మాత్రం..?

వేదం కాంబో పై మంచి హైప్


‘వేదం’ (Vedam) కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. అనుష్క, క్రిష్ (Krish) చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఘాటి’. హరిహర వీరమల్లు (Harihara veeramallu) సెట్స్ ఉన్నప్పుడే క్రిష్ ఈ ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాడు. పవన్‌తో క్రిష్‌ మొదలు పెట్టిన హరిహర వీరమల్లు షూటింగ్ చాలా డిలే అయింది. ఇప్పటికీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో.. ఇప్పట్లో వీరమల్లు కంప్లీట్ అయ్యేలా లేదని.. అనుష్కతో సైలెంట్‌గా ‘ఘాటి’ సినిమా మొదలు పెట్టాడు క్రిష్. విభిన్న కథా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నేరస్థురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ఈ సినిమా రూపొందుతోంది. యు.వి.క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. అయితే.. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. సమ్మర్‌లో విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ.. ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు కదా.. ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు.

Also Read: అజ్ఞాతవాసి వల్ల చాలా డబ్బులు వచ్చాయి… డిజాస్టర్ మూవీ లెక్క చెప్పిన నిర్మాత

వాయిదా పడినట్టే!

మేకర్స్ మొదట ‘ఘాటి’ సినిమాను 2025 ఏప్రిల్ 18న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఈ లెక్కన ఈపాటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ సినిమా రిలీజ్‌కు మరో నెల రోజుల సమయం కూడా లేదు. షూటింగ్ ఆలస్యం కారణంగా కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదట. దీంతో ‘ఘాటి’ చిత్రం ముందుగా అనుకున్న సమాయానికి విడుదల అయ్యేలా లేదు. ఘాటి కోసం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ కొత్త డేట్‌ను లాక్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనుష్క ఊచకోత సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇదే స్పీడ్‌లో సినిమా రిలీజ్ చేస్తారని స్వీటీ అభిమానులు భావించారు. కానీ ఘాటి మరింత వెనక్కి వెళ్లేలా ఉంది. ఈ సినిమా పై దర్శకుడు క్రిష్‌తో పాటు అనుష్క భారీ ఆశలు పెట్టుకుంది.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×