Free Train Travels: చాలా మంది ప్రయాణీకులు ఇప్పటికీ టికెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటారు. చెకింగ్ సమయంలో టీటీఈ పట్టుబడితే జరిమానా కడతారు. దొరికి ఫైన్ కట్టేవారి సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. జరిమానా చెల్లించకుండా ప్రయాణం చేసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. కానీ, ఓ యువకుడు కాస్త డిఫరెంట్ గా ఆలోచించి రైలు ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు. ఒక్క పైసా చెల్లించకుండా ఏడాది పాటు జర్నీ చేశాడు. ఏకగా రూ. 1.06 లక్షలు సేవ్ చేసుకున్నాడు. ఈ విషయం రైల్వే అధికారులకు తెలిసినా ఏం చేయలేకపోయారు. పైగా అతడి తెలివి చూసి ఆశ్చర్యపోయారు.
ఏడాది ఫ్రీ రైలు ప్రయాణం ఎలా?
ఏడాది పాటు ఉచితంగా రైలు ప్రయాణం చేసింది ఎడ్ వైజ్ అనే బ్రిటన్ యువకుడు. ఉచిత ప్రయాణం చేసేందుకు ఓ తెలివైన ఉపాయం ఆలోచించాడు. అలాగని రైల్వే నిబంధనలకు వ్యతిరేకంగా జర్నీ చేయలేదు. రైల్వే రూల్స్ ప్రకారమే తన ప్రయాణం కొనసాగించాడు. ఏడాది రూ. 1.06 లక్షల రైల్వే ఛార్జీలు సేవ్ చేసుకున్నాడు. అతడి ట్రిక్ రైల్వే అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయారు. దానికి కారణం అతడు ఎక్కడా నిబంధనలు అతిక్రమించకపోవడం. ఇంతకీ ఆయన ప్లే చేసిన ట్రిక్ ఏంటంటే..
ఎడ్ వైజ్ ప్లాన్ ఏంటంటే?
29 ఏండ్ల పర్సనల్ ఫైనాన్స్ రైటర్ ఎడ్ వైజ్.. ఫ్రీగా రైలు ప్రయాణం చేయడం ఎలా అని బాగా ఆలోచించాడు. రైల్వే లూప్ హోల్స్ ను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అధికారులకు తెలిసినా ఏం చేయలేని విధంగా ఉండాలనకున్నాడు. తన ప్లాన్ ను అమల్లో అమల్లో పెట్టాడు. డబ్బులు చెల్లించకుండా రైలు ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. బ్రిటన్ రైల్వే రూల్స్ ప్రకారం.. రైలు 15 నిమిషాలు ఆలస్యం అయితే, 25% డబ్బులు రీఫండ్ చేస్తారు. 30 నిమిషాల ఆలస్యానికి 50% వాపసు అందిస్తారు. గంట దాటితే పూర్తి రీఫండ్ అందిస్తారు. ఎడ్ వైజ్ ఈ రూల్స్ ను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. రైళ్లు ఏ సమయంలో ఆలస్యం అవుతాయో ముందుగానే తెలుసుకునేవాడు. సమ్మెలు, మెయింటెనెన్స్, వాతావరణ పరిస్థితుల కారణంగా రైళ్లు ఆలస్యం అవుతాయని తెలుసుకుని.. వాటికి అనుగుణంగా టికెట్లు బుక్ చేసుకునే వాడు. అనుకున్నట్లుగానే రైళ్లు ఆలస్యం కాగానే రీఫండ్ క్లెయిమ్ చేసుకునేవాడు. ఇలా ఏడాదిలో ఏకంగా రూ. 1.06 లక్షలు రీఫండ్ తీసుకున్నాడు.
రైల్వే అధికారులు షాక్!
ఎడ్ వైజ్ తెలివి గురించి రైల్వే అధికారులకు తెలిసింది. అయినప్పటికీ, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇతరులు కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతారో ఏమో? అని రైల్వే అధికారులు టెన్షన్ పడుతున్నారు. మొత్తంగా ఎడ్ వైజ్ తెలివికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రూల్స్ లోని లొసుగులను ఆయన కంటే ఎవరూ బాగా అర్థం చేసుకోలేరని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ లో ఎడ్ వైజ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు.
Read Also: ఆ రూట్ లో ప్రమాదం.. 51 రైళ్లకు అంతరాయం.. ఎన్ని రద్దయ్యాయంటే?