Indian Railways: అత్యవసర ప్రయాణాలు చేసే వ్యక్తుల కోసం భారతీయ రైల్వే ‘తత్కాల్ టికెట్’ బుకింగ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణ షెడ్యూల్ కు ఒక రోజు ముందు తత్కాల్ టికెట్స్ బుకింగ్ ప్రారంభం అవుతుంది. అయితే, తత్కాల్ టికెట్స్ బుకింగ్ విషయంలో ప్రయాణీకుల నుంచి నిత్యం విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ టికెట్స్ బుకింగ్స్ విషయం నెట్టింట పెద్ద రచ్చకు కారణం అయ్యింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
క్షణాల్లో తత్కాల్ టికెట్స్ ఖతం!
రీసెంట్ గా సోను నిగమ్ సింగ్ అనే ప్రయాణీకుడు ఢిల్లీ నుంచి బీహార్ లోని దర్భంగా వరకు ప్రయాణించాలి అనుకున్నాడు. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి రావడంతో ఐఆర్సీటీసీ యాప్ ద్వారా తత్కాల్ రైలు టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. సోను సరిగ్గా ఉదయం 10 గంటలకు యాప్ ఓపెన్ చేసి, టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలో ‘బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు’ అనే పాప్ అప్ మెసేజ్ కనిపించింది. అంతేకాదు, ‘కొంత సమయం తర్వాత ప్రయత్నించండి’ అనే మరో మెసేజ్ కనిపించింది. నిజమేనని నమ్మి సోను మూడు నిమిషాల తర్వాత ప్రయత్నించాడు. యాప్ రీఫ్రెష్ చేసి టికెట్ బుకింగ్ చేయాలి అనుకున్నాడు. అప్పటికే 41 వెయిటింగ్ లిస్ట్ చూపించింది. హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పటికీ తాను తత్కాల్ టికెట్ పొందలేకపోయానని నిరాశ వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని సోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో తత్కాల్ కోటా కింద 240 సీట్లు ఉన్నప్పటికీ తనకు కన్ఫార్మ్ టికెట్ దొరకలేదన్నారు.
TATKAL TICKET BOOKING reality: Two screenshots, booking starts at 10am, gareeb rath had 240 seats under tatkal quota.
10.01 am – "booking not started" pop-up appears. then app crashes and starts buffering.
10.04 am – app responds. now it shows status as waiting list 41.
even… pic.twitter.com/ib9i7Qn9mi
— Sonu Nigam (@SonuNigamSingh) May 28, 2025
ఏజెంట్లకు ఎలా సాధ్యం?
సాధారణ ప్రయాణీకులు తత్కాల్ టికెట్స్ బుకింగ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కావడం లేదని, ఏజెంట్లు మాత్రం సక్సెస్ ఫుల్ గా టికెట్స్ ను బుకింగ్స్ చేస్తున్నారని సోను సోషల్ మీడియాలో వెల్లడించారు. తాను మాత్రం హైస్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా చేయలేకపోయానని నిరాశ వ్యక్తం చేశారు. ఇది ఎలా సాధ్యమో ఇప్పటికీ ఓ రహస్యంగానే తోస్తుందన్నారు. “తత్కాల్ టికెట్ కన్ఫార్మర్ కాలేదని బాధపడాల్సిన అసవరం లేదు. టికెట్ 3x రీఫండ్ యాప్ ను ట్రై చేయండి” అని సోనుకు మరో నెటిజన్ సూచించాడు. ఇదే పెద్ద స్కామ్ అంటూ ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. తత్కాల్ టికెట్ బుకింగ్ అనేది ఓ బ్రహ్మపదార్థం అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా సోను లేవనెత్తిన విషయం నెట్టింట తీవ్ర చర్చకు కారణం అయ్యింది.
స్పందించిన ఐఆర్సీటీసీ!
ఈ వ్యవహారంపై ఐఆర్సీటీసీ స్పందించింది. తత్కాల్ టికెట్ బుకింగ్ టైమ్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. సాధారణ ప్రయాణీకులు ఈజీగా టికెట్ బుకింగ్ చేసుకునేలా వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని ప్రకటించింది. “తత్కాల్ సమయంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పెద్ద సంఖ్యలో వినియోగదారులు ప్రయత్నం చేయడం వల్ల అత్యంత వేగంగా కంప్లీట్ అవుఆయి. సిస్టమ్ రియల్-టైమ్‌లో చాలా రిక్వెస్టులు వస్తున్న కారణంగా ప్రాసెసింగ్ కు అదనపు సమయం పట్టే అవకాశం ఉంటుంది” అని ఐఆర్సీటీసీ వెల్లడించింది.
Read Also: విజయవాడ To అయోధ్య, పరుగులు తీయనున్న వందేభారత్ స్లీపర్!