Krishna Vamsi : ప్రస్తుతం ఆయన సినిమాలు అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం లేదు కానీ ఒకప్పుడు కృష్ణవంశీకి క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరు ఉండేది గులాబీ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణవంశీ తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. నిన్నే పెళ్లాడుతా, సింధూరం, చంద్రలేఖ, ఖడ్గం వంటి ఎన్నో సినిమాలు ఆయన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కేవలం దర్శకుడుగా కాకుండా నిర్మాతగా కూడా సింధూరం సినిమా చేశాడు కృష్ణవంశీ. అప్పట్లో ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా కూడా ఇప్పటికే ఆ సినిమాకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ కృష్ణవంశీ రాంగోపాల్ వర్మను తన గురువుగా చెబుతూ వస్తారు. రాంగోపాల్ వర్మ శివ సినిమా చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు కృష్ణవంశీ. ఆ తర్వాత ఆయన దగ్గరే పని చేసి డైరెక్షన్ మెలుకువలు కూడా నేర్చుకున్నారు.
వెంకటేష్ ను రిజెక్ట్ చేశారు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తారు. ఇప్పటికీ వెంకటేష్ కు అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు థియేటర్ కి జనాలు రావడం తగ్గించారు గాని ఒకప్పుడు థియేటర్ ఒకటే వినోదంగా ఉండేది. రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేస్తున్న కృష్ణవంశీకి దర్శకుడుగా చాలా అవకాశాలు వచ్చాయి. ఒక తరుణంలో సురేష్ బాబు ముందు నాకు కథను చెప్పు నేను కన్విన్స్ అయితే నీకు విక్టరీ వెంకటేష్ను హీరోగా ఇస్తాను అని చెప్పుకొచ్చారు. మామూలుగా కొందరు దర్శకులు ఓకే అని చెబుతారు. కానీ కృష్ణవంశీ మాత్రం మీరు కన్విన్స్ అయినా కూడా నేను చక్రవర్తి తోనే ఈ సినిమా చేస్తాను అని గట్టిగా చెప్పేసాడు.
సురేష్ ప్రొడక్షన్ లో సినిమా చేయలేదు
అయితే ఆ తరువాత రెండు మూడు సార్లు సురేష్ ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేద్దాం అని అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్టులు ఏవి పట్టాలెక్కలేదు. దీనిపై గతంలో కూడా కృష్ణవంశీ స్పందిస్తూ ” ఏదైనా చెప్పు వంశీ చేద్దాం అని అన్నారు. కానీ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కు మన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కి వర్కౌట్ కాకపోవడం వలన ప్రాజెక్టు చేయలేదు అంటూ కృష్ణవంశీ తెలిపారు. అలా ఈ రోజుల్లో చెప్పే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. కేవలం ఒక డిన్నర్ సెట్ అయితే చాలు ఆ హీరోతో సినిమా చేయడానికి ఏదో ఒక కథను సిద్ధం చేసి పట్టాలెక్కిస్తున్నారు.
Also Read : Bellamkonda Sai Srinivas: ఛత్రపతి నేను ముందు చేసుంటే బాగుండేది