దేశ వ్యాప్తంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. అన్ని రూట్లలో వందశాతం అక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దేశ వ్యాప్తంగా సుమారు 10 వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు మూడు స్లీపర్ రైళ్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో రెండు రైళ్లు తొలి విడుతలో అందుబాటులోకి రానుండగా, మరో రైలు రెండో విడుతలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ రైళ్లకు సంబంధించి రూట్లు కూడా ఖరారు అయ్యాయి.
వందేభారత్ స్లీపర్ రైళ్లు ఏ మార్గాల్లో నడుస్తాయంటే?
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రావడం ఖాయం కావడంతో ఆ మార్గాలు ఏవి అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో ఈ రైళ్లను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. చర్చల తర్వాత ఒక వందేభారత్ స్లీపర్ రైలును విజయవాడ- బెంగళరూ మధ్య అందుబాటులోకి తీసుకురావాలని డిసిషన్ తీసుకున్నారు. ఈ రైలు తిరుపతి మీదుగా ప్రయాణించనుంది. విజయవాడ నుంచి తిరుపతితో పాటు బెంగళూరుకు వెళ్లే ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించనుంది. మరో రైలును సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి నడపాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 1667 కిలో మీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 20 గంటల్లో పూర్తి చేయనుంది.
వందేభార్ స్లీపర్ రైలు ఛార్జీల వివరాలు
వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 11 థర్డ్ ఎసీ, 4 సెకండ్ ఎసీ, 1 ఫస్ట్ ఎసీ కోచ్‌లు ఉంటా యి. న్యూఢిల్లీ-సికింద్రాబాద్ వందేభారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ నుంచి రాత్రి 08:50 గంటలకు బయల్దేరుతుంది. ఆగ్రా కాంట్, గ్వాలియర్, వీరాంగన లక్ష్మీ బాయి ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగ్‌పూర్, బల్హర్షా, ఖాజీపేట్ జంక్షన్ మీదుగా మరుసటి రోజు ఈ రైలు రాత్రి 08:00 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకోనుంది. ఇక ఈ రైలు ఛార్జీల విషయానికి వస్తే, థర్డ్ ఎసీ కోచ్ ఛార్జీ దాదాపు రూ.3600, సెకండ్ ఎసీ కోచ్ ఛార్జీ రూ.4800, ఫస్ట్ ఎసీ కోచ్ ఛార్జీ దాదాపు రూ.6000 ఉంటుందని భావిస్తున్నారు. త్వరలో అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Also: హమ్మయ్య.. ఆ రైలు నెల రోజులకు పొడిగింపు, విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్!
విజయవాడ నుంచి వారణాసికి వందేభారత్ స్లీపర్
అటు రెండో విడుతలో ఏపీ నుంచి వారణాసికి వందేభారత్ స్లీపర్ రైలు నడిపించాలని రైల్వేశాఖ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా వందేభారత్ స్లీపర్ ను అయోధ్య, వారణాసి వరకు కొనసాగించనున్నారు. ఈ రైలు అందుబాటు లోకి వస్తే అయోధ్య, వారణాసి వెళ్లాలనుకునే తెలుగు భక్తులకు అనుకూలంగా ఉంటుంది. త్వరలో తెలుగు రాష్ట్రాలకు కేటాయించే వందేభారత్ రైళ్లకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read Also: ఇండియన్స్ కు ఫిలిప్పిన్స్ బంపర్ ఆఫర్.. వీసా అక్కర్లేదు, అదొక్కటీ చాలు!