BigTV English

Beautiful Railway Stations: దేశంలో అత్యంత అందమైన 10 రైల్వే స్టేషన్లు, ఒక్కసారైనా చూసి తీరాల్సిందే!

Beautiful Railway Stations: దేశంలో అత్యంత అందమైన 10 రైల్వే స్టేషన్లు, ఒక్కసారైనా చూసి తీరాల్సిందే!

Indian Railway Stations: దేశంలో 7300 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్నిఅద్భుతమైన నిర్మాణం, చారిత్రక విలువ, సహజ సౌందర్యంతో కనువిందు చేస్తున్నాయి. దేశంలో ప్రసిద్ధ రైల్వే స్టేషన్లలో టాప్ 10 స్టేషన్లు ఏవో ఇప్పుడు చూద్దాం..


⦿ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), ముంబై

ఈ రైల్వే స్టేషన్ ను 1887లో నిర్మించారు. దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్ ఈ రైల్వే స్టేషన్ ను డిజైన్ చేశారు. విక్టోరియన్ గోతిక్ రివైవల్, ఇండో-సరసెనిక్ శైలిలో నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ గోపురాలు, చెక్కడాలు, శిల్పాలు దీనిని ప్రత్యేకం ఆకర్షణగా నిలిపాయి.


⦿ చార్‌బాగ్ రైల్వే స్టేషన్, లక్నో

ఈ రైల్వే స్టేషన్ ను 1914లో నిర్మించారు. అవధీ, రాజపుత్ర, మొఘల్ శైలుల మిశ్రమంతో రూపొందించబడింది. చార్‌బాగ్  అంటే నాలుగు తోటలు అని అర్థం. ఈ స్టేషన్ నాలుగు తోటల నడుమ ఉంటుంది. పైనుంచి చూస్తే ఈ స్టేషన్ చదరంగం బోర్డులా కనిపిస్తుంది. స్తంభాలు, గోపురాలు చదరంగంలో పావుల మాదిరిగా ఉంటాయి.

⦿ హౌరా జంక్షన్, కోల్‌కతా

దేశంలోని అత్యంత పురాతనమైన, అతిపెద్ద రైల్వే స్టేషన్. దీనిని 1854లో నిర్మించారు. హుగ్లీ నది ఒడ్డున ఉన్న ఈ స్టేషన్ నియో-క్లాసికల్ శైలిలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హాల్సీ రికార్డో డిజైన్ చేశారు. ప్రస్తుతం 23 ప్లాట్‌ ఫామ్‌ లతో రోజుకు ఇక్కడి నుంచి 10 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు.

⦿ ఘుమ్ రైల్వే స్టేషన్, డార్జిలింగ్

దేశంలోని అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ ఇది. 2,258 మీటర్ల ఎత్తులో ఉంటుంది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో భాగంగా కొనసాగుతోంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేషన్ చుట్టూ ఉన్న పొగమంచు  కొండలు, టీ గార్డెన్‌లు ఆకట్టుకుంటాయి.

⦿ దూధ్‌సాగర్ రైల్వే స్టేషన్, గోవా

దూధ్‌సాగర్ జలపాతం సమీపంలో ఉన్న ఈ స్టేషన్ సహజ సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది. దట్టమైన అడవులు, జలపాతం దృశ్యం పర్యాటక ఆకర్షణగా మార్చాయి. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత ఇది బాగా పాపులర్ అయింది.

⦿ విజయవాడ జంక్షన్, ఆంధ్రప్రదేశ్

1888లో నిర్మితమై ఈ రైల్వే స్టేషన్ సౌత్ ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఆధునిక, సాంప్రదాయ డిజైన్ మిశ్రమంతో ఆకట్టుకుంటుంది.

⦿ చెన్నై సెంట్రల్, తమిళనాడు

1873లో నిర్మితమైన ఈ స్టేషన్ గోతిక్ రివైవల్ శైలిలో అలరిస్తోంది. ఎరుపు ఇటుకలతో, 136 అడుగుల ఎత్తైన గడియార స్తంభం దీని ప్రత్యేకత.

⦿ కటక్ రైల్వే స్టేషన్, ఒడిషా

14వ శతాబ్దంలో నిర్మితమైన బరాబతి కోట ఆకారంలో రూపొందించబడింది. ఈ ఫోర్ట్ స్టైల్ ఆర్కిటెక్చర్ ప్రయాణీకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.

⦿ జైసల్మేర్ రైల్వే స్టేషన్, రాజస్థాన్

తార్ ఎడారిలో ఉన్న ఈ స్టేషన్ బంగారు వర్ణంలో ఆకట్టకుంటుంది. రాజస్థాన్ రాజపుత్ర శైలి డిజై న్‌తో నిర్మించారు. ఈ స్టేషన్ లో లగ్జరీ రైళ్లు ఆగుతాయి.

⦿ బరోగ్ రైల్వే స్టేషన్, హిమాచల్ ప్రదేశ్

కల్కా-షిమ్లా రైల్వేలో భాగమైన ఈ చిన్న స్టేషన్ టన్నెల్ నంబర్ 33 సమీపంలో ఉంది. చుట్టూ హిమాలయ కొండలు, సహజ సౌందర్యం దీనిని మరింత అందంగా మార్చాయి.

Read Also:  వామ్మో.. ఇండియన్ రైల్వే ఇన్ని ఆఫర్లు అందిస్తుందా? అస్సలు తెలియదే!

Related News

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Big Stories

×